మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ప్రతినెల 20 వేల రూ|| ఫండ్ ను టైలర్ అసోసియేషన్‌కు అందజేస్తాం - జాన్ సైదా

ప్రతినెల 20 వేల రూ|| ఫండ్ ను టైలర్ అసోసియేషన్‌కు అందజేస్తాం - జాన్ సైదా

చిలకలూరిపేట:- పట్టణంలోని టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ జాన్ సైదా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కుట్టుమిషన్ సృష్టికర్త అయిన స్త్రీ ఇలియన్స్ హోవే గారి చిత్రపటానికి పూలమల వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాన్ సైదా మాట్లాడుతూ ప్రతినెల 20 వేల రూపాయలు టైలర్స్ అసోసియేషన్ సభ్యులకు అందిస్తానని హామీ ఇచ్చారు. టైలర్స్ అసోసియేషన్క తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం టైలర్  అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి జాన్ సైదా గారిని పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ సభ్యులు , పోతవరం సర్పంచ్ భాషా మేస్త్రి, కరీముల్లా, ఆది బాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 

Share:

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి

చిలకలూరిపేట - కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లకుండా ఆర్చి నిర్మించారు - కాపులకు & కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారు - ఎడవల్లి సర్పంచ్ తిరుమలేశ్వరి


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడవల్లి గ్రామ సర్పంచ్ తిరుమలేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఏడవల్లి గ్రామ సర్పంచ్ గా చేసిన మహిళా కుమారుడు గ్రామంలో మూడు ఆర్చీలు నిర్మించారని వాటి వలన కోటప్పకొండ తిరణాలకు ప్రభలు వెళ్లడానికి అడ్డంగా ఉందని పలుసార్లు చెప్పినా కూడా వారు పట్టించుకోవటం లేదని ఆమె తెలిపారు. ఊరిలో కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని, కాపుల స్మశాన వాటికను పూర్తిగా ఆక్రమించుకున్నారని... ఏంటని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లారని ఎమ్మార్వో ని కలిస్తే ఆమె కూడా వారికే వత్తాసు పలికారని తిరుమలేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న పోరంబోకు స్థలాలు మొత్తాన్ని ఆక్రమించుకున్నారని చివరకు వాగులను స్మశానవాటికలను కూడా వదలడం లేదని ఆమె తెలిపారు. గ్రామంలో కాపులకు, కమ్మవారికి మధ్య గొడవలు సృష్టిస్తున్నారని, స్మశాన వాటికలో ఆక్రమాలు తొలగించాలని పలుమార్లు ఎమ్మార్వో చుట్టూ తిరిగిన ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని చివరిగా ఆమె ట్రాన్స్ఫర్ వెళ్లిపోయిందని  ఆవేదనను తెలియజేశారు.

Share:

చిలకలూరిపేట - బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ

చిలకలూరిపేట - బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ


చిలకలూరిపేట:- బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే చలంచర్ల నాగమ్మ(55) అనే మహిళ రెండు సంవత్సరాలుగా సొలస గ్రామం ఎస్టి కాలనీలో నివాసం ఉంటుంది. స్థానికుల సమాచారం మేరకు ఒంటరిగా జీవిస్తున్న ఆమె పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని, అందువలనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని వారు తెలిపారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని బావి నుండి బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Share:

త్వరలో జరగబోయే పల్నాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నాను - ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

త్వరలో జరగబోయే పల్నాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నాను  - ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు




పల్నాడు జిల్లా :- గత కొంతకాలంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడిపి టిడిపిలో చేరడం ఖరారు అయినా కూడా తేదీని ప్రకటించకపోవడంపై సందిగ్ధత నెలకొన్నది. నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బిజెపికి ఇస్తారనే ప్రచారంతో అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిత్వం వస్తుందో అనే ప్రచారానికి తెరపడింది. ఎంపీ ఆఫీస్ నుండి అఫీషియల్ గా త్వరలో జరగబోయే పలనాడు భారీ బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గురించి మరియు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ పలనాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇస్తున్నాను అని ఆ ప్రెస్ నోట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

Share:

టిడిపి - జనసేన అభ్యర్థులు వీరే

టిడిపి - జనసేన అభ్యర్థులు వీరే :-


టీడీపీ అభ్యర్థులు :-

ఆముదాలవసల - కూన రవికుమార్

ఇచ్చాపురం - బెందాళం అశోక్

టెక్కలి - అచ్చెన్నాయుడు

రాజాం - కొండ్రు మురళీమోహన్

అరకు - దొన్ను దొర

కురుపాం - జగదీశ్వరి

పార్వతీపురం - విజయ్ బొనెల

సాలూరు - గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలి - బేబీ నాయన

గజపతి నగరం - కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం - పూసపాటి అదితి

నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు

పాయకరావుపేట - వంగలపూడి అనిత

విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ వెస్ట్ - గణబాబు

ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు

పి గన్నవరం - మహాసేన రాజేష్

కొత్తపేట - బండారు సత్యానందరావు

మండపేట - జోగేశ్వరరావు

రాజమండ్రి - ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ

పెద్దాపురం - చినరాజప్ప

తుని - యనమల దివ్య

అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

ఆచంట - పితాని సత్యనారాయణ

పాలకొల్లు - నిమ్మల రామానాయుడు

ఉండి - మంతెన రామరాజు

తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ

చింతలపూడి - సొంగా రోషన్ కుమార్

తిరువూరు - కొలికపూడి శ్రీనివాసరావు

నూజివీడు - కొలుసు పార్థసారథి

ఏలూరు - బడేటి రాధాకృష్ణ

గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ - వెనిగండ్ల రాము

పెడన - కాగిత కృష్ణ ప్రసాద్

మచిలీపట్నం - కొల్లు రవీంద్ర

పామర్రు - కుమార్ రాజా

విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ ఈస్ట్ - గద్దే రామ్మోహన్

జగ్గయ్య పేట - శ్రీరామ్ తాతయ్య

నూజివీడు - కొలుసు పార్థసారథి

నందిగామ - తంగిరాల సౌమ్య

తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్

మంగళగిరి - నారా లోకేష్

పొన్నూరు - ధూళిపాళ్ల నరేందర్ కుమార్

బాపట్ల - నరేంద్ర వర్మ

ప్రత్తిపాడు - బూర్ల రామాంజనేయులు

చిలకలూరి పేట - ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ

వినుకొండ - జీవీ ఆంజనేయులు

మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి

రేపల్లె - అనగాని సత్యప్రసాద్

ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు

పర్చూరు - ఏలూరి సాంబశివరావు

సంతనూతలపాడు - బీఎన్ విజయ్‌కుమార్

అద్దంకి - గొట్టిపాటి రవికుమార్

ఒంగోలు - దామచర్ల జనార్థనరావు

కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహరెడ్డి

కొండెపి - డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి

కావలి - కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

గూడూరు - పాశం సునీల్ కుమార్

సూళ్లూరు పేట - విజయ శ్రీ

ఉదయగిరి - కాకర్ల సురేష్

కడప - మాధవి రెడ్డి

రాయచోటి - రాంప్రసాద్ రెడ్డి

పులివెందుల - బీటెక్ రవి

మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్

ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియ రెడ్డి

శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్ రెడ్డి

కర్నూలు - టీజీ భరత్

పాణ్యం - గౌరు చరితా రెడ్డి

నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్

బనగానపల్లె - బీసీ జనార్థన్ రెడ్డి

డోన్ - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

పత్తికొండ - కేఈ శ్యాంబాబు

కొడుమూరు - దస్తగిరి

రాయదుర్గం - కాలువ శ్రీనివాసులు

ఉరవకొండ - పయ్యావుల కేశవ్

తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి

శింగనమల - బండారు శ్రావణి శ్రీ

కళ్యాణ దుర్గం - అమిలినేని సురేంద్రబాబు

రాప్తాడు - పరిటాల సునీత

మడకశిర - సునీల్ కుమార్

హిందూపురం - నందమూరి బాలకృష్ణ

పెనుకొండ - సవితమ్మ

తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి

పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

నగరి - గాలి భాను ప్రకాష్

గంగాధర నెల్లూరు - బీఎం థామస్

చిత్తూరు - గురజాల జగన్‌మోహన్

పలమనేరు - అమర్‌నాథ్ రెడ్డి

కుప్పం - నారా చంద్రబాబునాయుడు


జనసేన అభ్యర్థులు :-

నెల్లిమర్ల- లోకం మాధవి

అనకాపల్లి- కొణతాల రామకృష్ణ

కాకినాడ రూరల్ - పంతం నానాజీ

తెనాలి-నాదెండ్ల మనోహర్

రాజానగరం - బత్తుల బలరామ కృష్ణ

Share:

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

గత కొంత కాలంగా బిజెపి పొత్తు విషయమై జాప్యం చేస్తున్న నేపథ్యంలో జనసేన - టిడిపి అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు ఈరోజు చంద్రబాబు - పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టిడిపి అభ్యర్థి పేరును పత్తిపాటి పుల్లారావు గా ప్రకటిస్తూ భిన్నాభిప్రాయాలకు తెరదించారు. స్థానికంగా చిలకలూరిపేటలో భారీగా పట్టు ఉన్న ప్రత్తిపాటికే చిలకలూరిపేట టిడిపి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గత కొంతకాలంగా జనసేన - తోటరాజ రమేష్ తో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా ప్రత్తిపాటిని ఎంపిక చేసినందుకుగాను టిడిపి కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.

Share:

బ్రేకింగ్ న్యూస్ :- రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బ్రేకింగ్ న్యూస్ :- రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే రాసి నందిత సికింద్రాబాద్ నుండి బాసరకు వెళ్తున్న సమయంలో పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై డివైడర్ను ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా చర్లపల్లి వద్ద కారు అదుపుతప్పి హోం గార్డెన్ ఢీకొనడంతో అతను అక్కడక్కడ మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు పది రోజుల సమయంలో ఈ యాక్సిడెంట్ లో చనిపోవడంతో నియోజకవర్గం ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. గత ఏడాది ఫిబ్రవరి 19 న లాస్య తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2023 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. లాస్య మృతి పట్ల పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి