మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట - మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు - గంగా శ్రీనివాస్

చిలకలూరిపేట :- పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ రఫాని ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే టిడిపి, వైసిపి కౌన్సిల్ సభ్యులు తమ వాదపవాదాలను చైర్మన్ కు తెలియజేశారు. ఈ సమావేశంలో టిడిపి కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని, చిలకలూరిపేట మున్సిపాలిటీని అవినీతిమయంగా కుంభకోణాల మున్సిపాలిటీగా మార్చేశారని ఆయన ఏదేవా చేశారు. అలాగే ఈ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు ఒకసారి 50 లక్షలు ఒకసారి కొన్ని రోజుల క్రితం 15 లక్షల రూపాయల కుంభకోణం జరిగితే మున్సిపల్ చైర్మన్ రఫాని చేతులెత్తేసారని ఆయన తెలిపారు. మన జరిగిన వైసీపీ సభలో పట్టణంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగకపోగా వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పుకోవటం సిగ్గుచేటని ఆయన తెలిపారు. వీటిపై సమీక్ష నిర్వహించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్.

5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను బాధితులకు అందజేసిన MLC మర్రి రాజశేఖర్.

చిలకలూరిపేట :- వివిధ అనారోగ్య సమస్యల వలన హాస్పిటల్లో చికిత్స పొందిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో 5,05,000/- రూపాయల విలువైన సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను రాజశేఖర్ ఆఫీస్ నందు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమకు ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు,  తెలుపుతూ తమకు సహకరించిన రాజశేఖర్ గారికి రుణపడి ఉంటాము అని వారు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట - సుబ్బయ్య తోట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

 చిలకలూరిపేట - సుబ్బయ్య తోట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

చిలకలూరిపేట - 52వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న పత్తిపాటి

చిలకలూరిపేట :- పట్టణంలోని సుబ్బయ్య తోట మస్తాన్ వలి దర్గా వద్ద 52వ ఉరుసు మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దేవరకొండ పుల్లారావుతో మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ దర్గా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బయ్య తోట యూత్ మరియు సుబ్బయ్య తోట టిడిపి కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింకు పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట - గోపిరెడ్డికి టికెట్ వస్తే సహకరించవద్దు - గజ్జల బ్రహ్మారెడ్డి

నరసరావుపేట :- ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరసరావుపేట వైసీపీలో అసమ్మతి సెగ తారా స్థాయికి చేరింది. ఏకంగా కార్యకర్తలను ఒకచోటకు చేర్చి తమ అసమతిని వెలగక్కారు. వివరాల్లోకి వెళితే నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి అవకాశం ఇస్తే సహకరించకూడదు అని ఆ పార్టీ నర్సరావుపేట సీనియర్ నేత గజ్జల బ్రహ్మారెడ్డి చెప్పారు. శుక్రవారం పెద్ద రెడ్డి పాలెం లో జరిగిన వైసిపి అంతర్గత సమావేశంలో పాల్గొన్న ఆయన కార్యకర్తలకు రాబోవు ఎన్నికలలో గోపిరెడ్డికి సహకరించవద్దని ఆయన తెలిపారు. ఇంకా అభ్యర్థి సీటు ఖరారు కాలేదని తెలియజేశారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

 గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్ర పోలీసులు

ఆంధ్రప్రదేశ్ :-  కంచె చేను మేస్తుందంటే ఇదేనేమో. గంజాయి నుంచి సామాన్య ప్రజలను రక్షించాల్సింది పోయి పోలీసులే గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడ్డారు. రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ తారస్థాయికి చేరింది. పోలీసులే ఏకంగా స్మగ్లింగ్ చేస్తున్నారంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటున్నారు విమర్శకులు. వివరాల్లోకి వెళితే నిన్న హైదరాబాద్ బాచుపల్లి SOT పోలీసులు చేసిన దాడిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి వివరాలు సేకరించగా నిందితులు ఏపీఎస్పీకి చెందిన కాకినాడ మూడవ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ గా గుర్తించారు. వీరి ప్రయాణిస్తున్న కారులో ఏకంగా 22 కేజీల దొరికినట్లు సమాచారం. విధులకు సెలవులు పెట్టి మరి ఈ ఘనకార్యానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుమూత

 బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుమూత

బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే 32 మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నా ఆమె చికిత్స పొందుతూ సొంత ఊరు అయిన కాన్పూర్లో నిన్న రాత్రి చనిపోయినట్లు వారు తెలిపారు. మాలిని అండ్ కో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా మైనార్టీ, ప్రధాన కార్యదర్శిగా ఎస్సీని నియమిస్తూనట్లు ప్రకటించిన ప్రత్తిపాటి

చిలకలూరిపేట :- ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ తమ స్ట్రాటజీలను అమలు చేయడంలో స్పీడును పెంచాయి. ఇప్పటికే అధికార వైసిపి మున్సిపల్ చైర్మన్ గా మైనారిటీ వ్యక్తిని, రెండుసార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి ఎస్సీలను నియమించింది. అయితే తాజాగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు  ఆధ్వర్యంలో చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ పార్టీ ప్రధాన అధ్యక్షుడిగా పఠాన్ సమద్ ఖాన్( మైనారిటీ) మరియు పట్టణ ప్రధాన కార్యదర్శిగా మద్దుమాల రవిని( SC) నియమిస్తున్నట్లు ప్రతిపాటి పుల్లారావు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ జెండా విజయకేతనం ఎగరవేయాలని అభిమానులకు దిశా నిర్దేశం చేశారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి