మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

విజయసాయిరెడ్డిని గుంటూరుకు చెవిరెడ్డిని ఒంగోలుకు - వైసిపి కీలక నిర్ణయం

విజయసాయిరెడ్డిని గుంటూరుకు చెవిరెడ్డిని ఒంగోలుకు - వైసిపి కీలక నిర్ణయం

విజయసాయిరెడ్డిని గుంటూరుకు చెవిరెడ్డిని ఒంగోలుకు - వైసిపి కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ :-  రాబోవు ఎన్నికలకు అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాలు మరియు అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్సిపి విజయకేతనం ఎగరేయడం కోసం విజయ్ సాయి రెడ్డిని మరియు ఒంగోలు పార్లమెంటు స్థానం మరియు కావలి, కందుకూరు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఇప్పటికే నరసరావుపేట ఎంపీగా  లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఎంపీ పదవి రాజీనామా చేయడంతో, నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దించారు. అలాగే గుంటూరు పార్లమెంటు స్థానాన్ని మరియు అసెంబ్లీ స్థానాల్లో ఎలా అయినా వైసీపీ కైవసం చేసుకోవాలని ఆ బాధ్యతలను విజయసాయి రెడ్డికి అప్పగించింది. ఒకప్పుడు ఒంగోలు ప్రాంతాలలో బాలినేని శ్రీనివాసరావు లేదా వైవి సుబ్బారెడ్డి, మాగుంట శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చేవారు. అలాంటిది ఈసారి వారందరినీ పక్కనపెట్టి చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

Share:

వైసీపీ నుండి ఎమ్మెల్యే గా మల్లెల రాజేష్ నాయుడు పోటీ చేస్తారు - విజయసాయిరెడ్డి

 వైసీపీ నుండి ఎమ్మెల్యే గా మల్లెల రాజేష్ నాయుడు పోటీ చేస్తారు - విజయసాయిరెడ్డి

చిలకలూరిపేట:- గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట వైసిపి అభ్యర్థి టికెట్ పై పలు సందేహాలు తలెత్తాయి. ప్రముఖ మీడియా ఛానల్లో కూడా దీనిపై చర్చ జరగడంతో పార్టీ క్యాడర్ ఒకింత అయోమయానికి గురైనది. ఇలాంటి సందేహాలు అన్నిటికీ తెరదించుతూ  విజయసాయిరెడ్డి అభ్యర్థిని ప్రకటించారు. ఈరోజు చిలకలూరిపేటలో సామాజిక సాధికారక యాత్రలో భాగంగా పాల్గొన్న విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చిలకలూరిపేట వైసిపి అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు ని ఖరారు చేస్తున్నట్లు టికెట్ పై ఎటువంటి సందేహ పడొద్దు అని ఆయన ప్రకటించారు. కొన్ని రోజులుగా విడుదల రజిని తిరిగి పేటలో పోటీ చేస్తారని లేదా జాన్ సైదా కు టికెట్ మారుస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటన్నిటికీ తెరదించుతూ విజయ్ సాయి రెడ్డి, మల్లెల రాజేష్ నాయుడుకి టికెట్ ఖరారు చేశారు. పార్టీలు వర్గాలుగా ఉండకుండా అందరూ ఒక తాటి మీదకు వచ్చి పార్టీని గెలిపించాల్సిందిగా విజయ్ సాయి రెడ్డి దిశా నిర్దేశం చేశారు.

Share:

పలనాడు జిల్లా - నాడు ఒకటే గూడు నేడు ప్రత్యర్థులై పోటీకి సిద్ధమాయెన ?

పలనాడు జిల్లా - నాడు ఒకటే గూడు నేడు ప్రత్యర్థులై పోటీకి సిద్ధమాయెన ?

పలనాడు జిల్లా - నాడు ఒకటే గూడు నేడు ప్రత్యర్థులై పోటీకి సిద్ధమాయెన ?

పల్నాడు జిల్లా :- గత కొన్ని రోజులుగా పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ స్థానంపై హైడ్రామాన్ని నెలకొన్నది. ఇప్పటికే అక్కడ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయ వైఎస్ఆర్సిపి పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే, అయితే ఇప్పుడు కొత్తగా వైసిపి పార్టీ నుంచి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగా మాజీ మంత్రి, నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్ ను తెరపైకి తీసుకువచ్చారు. నెల్లూరు ఎమ్మెల్యే స్థానం నుంచి అనిల్ ను తప్పించి ఎంపి గా నరసరావుపేట నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్దేశించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఫేషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పటికే పార్టీ సభ్యత్వానికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీ నుండి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు అనుచర వర్గం తెలియజేస్తున్నారు. నాడు ఒకటే పార్టీలో కలిసి పనిచేసిన శ్రీకృష్ణదేవరాయలు మరియు అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ప్రత్యర్థులుగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వివాదరహితుడిగా పేరు ఉన్న శ్రీకృష్ణదేవరాయలను వైసీపీలో ఫైర్ బ్రాండెడ్ లో ఒకరైన అనిల్ కుమార్ యాదవ్ ఎలా ఎదుర్కొంటారు అనే ప్రశ్న జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. పార్లమెంట్ పరిధిలో లక్షకు పైగా ఓటు బ్యాంకు  ఉన్న యాదవ సామాజిక వర్గం మరియు బిసి వర్గ అండదండలు అనిల్ కుమార్ యాదవ్ కు అందుతాయా ? పార్లమెంట్ పరిధిలో తనకంటూ గొప్ప పేరుని సంపాదించుకున్న లావు శ్రీకృష్ణదేవరాయలు అతను చేసిన అభివృద్ధి ఒకవైపు అయితే ఎమ్మెల్యేగా, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ అనుభవం గట్టి పోటీని ఇవ్వగలడా ? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Share:

రోడ్డు ప్రమాదం - మూడుకి పెరిగిన మృతుల సంఖ్య - చిలకలూరిపేట

రోడ్డు ప్రమాదం - మూడుకి పెరిగిన మృతుల సంఖ్య - చిలకలూరిపేట

రోడ్డు ప్రమాదం - మూడుకి పెరిగిన మృతుల సంఖ్య - చిలకలూరిపేట

చిలకలూరిపేట :- నిన్న అనగా శుక్రవారం ఉదయం చిలకలూరిపేట - నరసరావుపేట రోడ్డులోని లింగంగుంట్ల చెక్ పోస్ట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు .దీంతో మృతుల సంఖ్య మూడుకి చేరింది. ఘటనా స్థలంలోనే అక్కడికక్కడ హనుమాయమ్మ (60) మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివ పార్వతి (58), హాజరత్ వలి (70) మృతి చెందారు. వీరంతా వేలూరు గ్రామానికి చెందిన వారు అవటంతో, ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరంతా వేలూరు గ్రామం నుండి గణపవరం డొంక మీదగా అప్పాపురంలో మిర్చి కోతలకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు చిలకలూరిపేట రూరల్ ఎస్సై తెలిపారు.

Share:

చిలకలూరిపేట - ఘోర రోడ్డు ప్రమాదం - కూలీలతో ఉన్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

చిలకలూరిపేట - ఘోర రోడ్డు ప్రమాదం - కూలీలతో ఉన్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు


చిలకలూరిపేట :- చిలకలూరిపేట - నరసరావుపేట మధ్య కావూరు చెక్పోస్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా , పదిమందికి పైగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు వేలూరు గ్రామానికి చెందిన కూలీలు పొలం పనుల నిమిత్తం ఆటోతో బయలుదేరగా కావూరు, లింగంగుంట్ల మధ్య ఉన్న చెక్ పోస్ట్ వద్ద మాచర్ల నుంచి చిలకలూరిపేట వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో పాటు బస్సు ముందు భాగం ఆటో పైకి ఎక్కి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పదిమందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడి చేరుకున్న చిలకలూరిపేట రూరల్ ఎస్సై క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share:

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ వైసిపికి రాజీనామా

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ వైసిపికి రాజీనామా

పల్నాడు జిల్లా :- నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయ వైసిపి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్న పనులు గురించి ఆయన వివరించారు. పార్టీలో నెలకొన్న అనిచ్చితి వల్ల తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీలకు ఇవ్వడానికి వైసిపి అధిష్టానం నిర్ణయించుకుంది. అందువలన ఎంపీ లావు శ్రీ కిష్ణదేవరాయని గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం ఆదేశించగా, ఆయన దానికి ససేమిరా అన్నారు. ఇప్పటికే నరసరావుపేట పార్లమెంట్ ప్రాంతంలో తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న ఆయన మరో స్థానంలో పోటీ చేయడానికి నిరాకరించారు. తనకు అండగా నిలిచిన పార్టీ పెద్దలు మరియు ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు‌.

Share:

రామనామ స్మరణతో దద్దరిల్లిన చిలకలూరిపేట పురవీధులు

రామనామ స్మరణతో దద్దరిల్లిన చిలకలూరిపేట పురవీధులు

రామనామ స్మరణతో దద్దరిల్లిన చిలకలూరిపేట పురవీధులు

చిలకలూరిపేట:- జనవరి 22 అయోధ్య లోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని చిలకలూరిపేట పట్టణ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని వీధులన్నీ శ్రీరామ నామ స్మరణతో మోత మోగిపోయాయి. పట్టణంలోని ముఖ్య వీధులలో పండుగ వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా గాంధీ పేట, సుబ్బయ్య తోట, చోత్రా సెంటర్, గోల్డ్ షాప్ బజార్ మద్ది మల్లయ్య వీధులలో భారీగా దేవుని కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం సమయాలలో చలివేంద్రం బజార్ నందు షరాఫ్ బజార్ మరియు మద్ది మల్లయ్య వీధి నందు భారీగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు భారీగా నగర సంకీర్తనలో పాల్గొన్నారు. చలివేంద్రం బజార్, గోల్డ్ షాప్ బజార్,మద్ది మల్లయ్య వీధి నందు ఉన్న రామాలయాలలో భక్తులు భారీగా చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుబ్బయ్య తోటలోని ప్రతి ఇంటి గోడ పైన జైశ్రీరామ్ అనే నామాన్ని అచ్చులుగా వేశారు. గౌడ కళ్యాణ మండపం వద్ద రామదండు యూత్ ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమం మరియు భక్తిరస నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

రామనామ స్మరణతో దద్దరిల్లిన చిలకలూరిపేట పురవీధులు


Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి