చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిరేపు చిలకలూరిపేట థియేటర్లో పోకిరి సినిమా 4K HD ప్రింట్ తో స్పెషల్ ఫ్యాన్స్ షోస్
చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ - కమిషనర్
చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ - కమిషనర్
చిలకలూరిపేట భారతదేశం స్వతంత్రం పొంది 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత మహోత్సవాల న చిలకలూరిపేట పట్టణంలో కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ ... చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై ఈనెల అనగా ఆగస్టు 13, 14 ,15, తేదీలలో ఈ జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటిచెప్పాలని కమిషనర్ కోరారు.
చిలకలూరిపేట పట్టణ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
చిలకలూరిపేట పట్టణ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలందరికీ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి ఇప్పటివరకు విద్యుత్ బకాయిలను చెల్లించాలని అంటే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయం నందు చెల్లించేవారు. కానీ ఇప్పటి నుండి విద్యుత్ బకాయిలు చెల్లించాలి అంటే పట్టణంలోనే కెబి రోడ్ లో ఉన్న ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ నందు చెల్లించాలని.. డిఈఈ అశోక్ కుమార్ తెలిపారు. కావున ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరారు.
చిలకలూరిపేట: యువకుడు అనుమానాస్పద మృతి
చిలకలూరిపేట: యువకుడు అనుమానాస్పద మృతి
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామం లో నివాసం ఉంటున్న ఒరిస్సాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఒరిస్సా రాష్ట్రం భద్రం గ్రామానికి చెందిన రమేష్ మాలిక్ సర్వేశ్వర్ మాలిక్ లు గ్రామంలోని ఒక కంపెనీలో పని పనిచేస్తూ గణపవరం గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ నందు అద్దెకు ఉంటున్నారు. అయితే రమేష్ మాలిక్ కు శనివారం ఉదయం చాతి నొప్పి రావడంతో సర్వేశ్వర మాలిక్ దగ్గర్లో ఉన్న మెడికల్ షాప్ నందు గ్యాస్ టాబ్లెట్ తీసుకొని వచ్చి రమేష్ హాలిక్ కు ఇచ్చాడు. ఆ టాబ్లెట్ వేసుకున్న రమేష్ మాలిక్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మృతిచెందాడు. విషయం గమనించిన సదరు సర్వేశ్వర్ మాలిక్ మృతదేహాన్ని బయటకు తీసుకు వస్తూ పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇది గమనించిన రమేష్ మాలిక్ బంధువైన ప్రమోద్ మాలిక్ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసు వారు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం వచ్చిన నివేదిక ఆధారం ప్రకారం రమేష్ మాలిక్ను పథకం ప్రకారం చంపబడ్డాడ లేదా నిజంగానే అనారోగ్యంతో మృతి చెందాడా అనే విషయం తెలియాల్సి ఉంది.
రోశయ్య ఎలా చనిపోయారంటే ? ఎక్కడ చనిపోయారంటే ?
రోశయ్య ఎలా చనిపోయారంటే ? ఎక్కడ చనిపోయారంటే ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం చనిపోయిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఆయన గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకున్నారు. అయితే హైదరాబాదు అమీర్పేట లోని తన సొంత గ్రామంలో ఉంటున్నారు. ప్రతిరోజు ఇంటి బయట ఉన్న వరండాలో కూర్చొని పేపర్ తిరగేయటం, శ్రేయోభిలాషులతో కలిసి వారితో ముచ్చటించడం అలవాటు. అదేవిధంగా ఈరోజు ఉదయం అలాగే వరండాలో కూర్చొని పేపర్ తిరగేస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు రోశయ్య ని చూసి అవాక్కయ్యారు. ఆయన నోటి నుండి రక్తస్రావం అవ్వటంతో పాటుగా అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన వారు హుటాహుటిన బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పటల్ కు తరలించారు. హాస్పటల్ లోని డాక్టర్లు చెప్పిన సమాచారం మేరకు ఆయన హాస్పిటల్ కి వచ్చే మార్గమధ్యంలోనే మరణించారని వారు తెలిపారు. ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ని వివిధ పార్టీ నాయకులు తో పాటు తమిళనాడు , కర్ణాటకలోని ప్రభుత్వాలు కూడా ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం పై అభ్యంతరాలు
ఏపీ: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం పై అభ్యంతరాలు
ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సొంత పేర్లను పెట్టుకోవటం పై ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీ లోని జగన్మోహన్ రెడ్డి తమ సొంత పథకంగా పేర్లు పెట్టుకోవడం పై కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్మృతి ఇరానీ స్పందించారు.
జగనన్న గోరుముద్ద, జగనన్న పాల వెల్లువ, వైయస్సార్ సంపూర్ణ పోషణ అనే పలు పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవటం పై ఆమె స్పందిస్తూ ... కేంద్ర ప్రభుత్వాల పథకాలపై రాష్ట్ర ప్రభుత్వాల సొంత పేర్లను & నచ్చిన పేర్లను పెట్టుకోవడం కుదరదని అలాగే MP రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుకు సమాధానం చెప్పాలని ఆమె కోరారు. అలాగే దీనిపైన నివేదిక కోరింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య మృతి చెందారు. అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు. 1933 జూలై 4 గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన ఆయన స్వతంత్ర సమరయోధుడు గా ఎన్.జి.రంగా కు శిష్యునిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక కీలక బాధ్యతలను నిర్వహించి అనూహ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ కు 2009 నుండి 2010 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 1968,1974,1980, 2009 సంవత్సరాలలో MLC గా ఎన్నికయ్యారు. 1989, 2004 లలో చీరాల నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989 సంవత్సరంలో నరసరావుపేట నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 సంవత్సరంలో కర్ణాటక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2011 నుండి 2016 వరకు తమిళనాడుకు గవర్నర్గా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ కు 15వ సీఎంగా, తమిళనాడుకు 31వ గవర్నర్గా పని చేశారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్ అండ్ బి, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 15 సార్లు అసెంబ్లీలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి మన కొణిజేటి రోశయ్య. రాజకీయ భీష్ముడుగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు.గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.






.jpeg)
.png)