మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య మృతి చెందారు. అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు. 1933 జూలై 4 గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన ఆయన స్వతంత్ర సమరయోధుడు గా ఎన్.జి.రంగా కు శిష్యునిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక కీలక బాధ్యతలను నిర్వహించి అనూహ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ కు 2009 నుండి 2010 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 1968,1974,1980, 2009 సంవత్సరాలలో MLC గా ఎన్నికయ్యారు. 1989, 2004 లలో చీరాల నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989 సంవత్సరంలో నరసరావుపేట నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 సంవత్సరంలో కర్ణాటక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2011 నుండి 2016 వరకు తమిళనాడుకు గవర్నర్గా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ కు 15వ సీఎంగా, తమిళనాడుకు 31వ గవర్నర్గా పని చేశారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్ అండ్ బి, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 15 సార్లు అసెంబ్లీలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి మన కొణిజేటి రోశయ్య. రాజకీయ భీష్ముడుగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు.గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.



Share:

భారత్ ను తాకిన కొత్త ఒమిక్రాన్ వేరియంట్ - ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే ? - వచ్చిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ?

భారత్ ను తాకిన కొత్త ఒమిక్రాన్ వేరియంట్ - ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే ? - వచ్చిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

కోవిడ్ తీవ్రత తగ్గుతుంది అనుకొనే సమయంలో సడన్ గా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రజలను భయపెడుతుంది. గత వేరియంట్ లతో పోలిస్తే ఇది త్వరగా వ్యాపిస్తుందని హడావిడి ఎక్కువైంది. అయితే గత కొన్ని రోజుల క్రితం నుండి విదేశాల నుండి భారత్ కి వచ్చిన వారిని పరీక్షించగా తాజాగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ ఉన్నట్లుగా ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరి కర్ణాటక బెంగళూరు ప్రాంతంగా తెలుస్తోంది. అయితే వీరిలో లక్షణాలు మాత్రమే ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తమై ఈ వేరియంట్ వ్యాప్తి చెందకుండా ఉండాలని అధికారులు తెలిపారు. విదేశాల నుండి వచ్చేవారికి కచ్చితంగా ఆర్ టి పి సి ఆర్ చేయాలని ఒకవేళ పాజిటివ్గా నిర్ధారణ అయితే ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తామని వారు తెలిపారు. ఏది ఏమైనా నా గత రెండు వేరియంట్లలో వలన జనజీవనం అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ మాస్కులు ధరించి కొత్త వేరియంట్ కట్టడికి సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

Share:

అఖండ సినిమా గురించి చిలకలూరిపేట ప్రజలు ‌ఏమి అంటున్నారు అంటే !

అఖండ సినిమా గురించి చిలకలూరిపేట ప్రజలు ‌ఏమి అంటున్నారు అంటే !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అఖండ మూవీ రివ్యూ :-  3 / 5

చాలా రోజుల తర్వాత పెద్ద హీరో సినిమా సినిమా ధియేటర్ లో సందడి చేయటంతో చిలకలూరిపేట లోని వి సెల్యూలాయిడ్ థియేటర్స్ అన్నీ పండుగ వాతావరణం నెలకొన్నది.

 ఇక సినిమా విషయానికొస్తే బోయపాటి తన మార్క్ ని చూపించాడు. సినిమాలోని క్యారెక్టర్స్ ను హై లెవెల్ ఓల్టేజితో చూపించటం బోయపాటికే సాధ్యం. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటికి తోడుగా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు ఒక రేంజిలో ఉంటాయి. ఆ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందనే చెప్పాలి. బాలకృష్ణ మాస్ ఎలిమెంట్స్ , డైలాగ్స్, ఫైట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైట్ సీన్స్, బాలకృష్ణ డాన్స్ ప్రేక్షకులకు ఉల్లాసాన్ని తీసుకొస్తాయి.శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ తో విలన్ పాత్రకు కొత్త రూపం తీసుకుని వచ్చాడు . తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాటలు చితక కొట్టేసాడు హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ అందం అభినయంతో ఆకట్టుకుంది పూర్ణ కూడా తన అందంతో నటనతో ఆకట్టుకుంది జగపతి బాబు తన పరిధి మేరకు మెప్పించాడు.

 మైనస్ పాయింట్ :- కథ సాగదీత

 చివరకు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ మరొకసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది. చిలకలూరిపేట ప్రజలు అఖండ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అంటే ఈ క్రింది వీడియోలో చూడండి.


Share:

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన పెడవల్లి అనిల్ (26) యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడని అనంతరం జాతీయ రహదారి పక్కనే ఉన్న అమృత మినరల్ వాటర్ ప్లాంట్ వెనుక ఉన్న ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. ఉదయం అటుగా వెళ్తున్న బాటసారులు జీవచ్ఛవంలా పడి ఉన్న మృతదేహాన్ని చూసి అనిల్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు అనిల్ విజయవాడలోని రాజకీయ నాయకుడి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నారని బంధువులు తెలిపారు‌.



Share:

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తి

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తి

చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారా పంపే విషయంలో పొరపాటు చేస్తున్నారని స్థానిక సబ్ ట్రెజరీ ఆఫీసర్ బి శ్రీనివాసరావు తెలిపారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జనవరి, ఫిబ్రవరి నెలలలో మాత్రమే పంపాలని ఆయన తెలిపారు. అయితే కొందరు పెన్షనర్లు ముందుగానే లైఫ్ సర్టిఫికెట్లను ఆన్ లైన్ ద్వారా పంపుతున్నారని, అవి చెల్లవని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కూడా కొందరు పెన్షనర్లు గడువు కంటే ముందే లైఫ్ సర్టిఫికెట్లను పంపడంతో అవి చెల్లక, వారు కొన్ని నెలలపాటు పెన్షన్ పొందలేకపోయారు ఆయన వివరించారు.




Share:

24/11/2021 to 28/11/2021 వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

24/11/2021 to 28/11/2021 వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి  విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారి ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా 24/11/2021 నుండి 28/11/2021 వరకు భారీ వర్షం సూచికల వలన ప్రజలందరూ అప్రమత్తమై బయటికి రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని... లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమై చిన్నపిల్లలను నీటి ప్రవాహానికి దూరంగా ఉంచుతూ .. వాగులు వంకలు ప్రవహించే ప్రాంతాలలో జాగ్రత్తలు వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు.



Share:

చిలకలూరిపేట మద్యం దుకాణంలో చోరీ

చిలకలూరిపేట మద్యం దుకాణంలో చోరీ

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని వేలూరు రోడ్డులో ఉన్న ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చోరీలో 2.32 లక్ష రూపాయల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎక్సైజ్ సీఐ భాష చోరీ జరిగిన  ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ఆ దుకాణానికి బాధ్యత వహిస్తున్న వ్యక్తి ఉద్యోగ భద్రతకై చోరీ జరిగిన మొత్తాన్ని చెల్లించాడు.




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి