మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

అఖండ సినిమా గురించి చిలకలూరిపేట ప్రజలు ‌ఏమి అంటున్నారు అంటే !

అఖండ సినిమా గురించి చిలకలూరిపేట ప్రజలు ‌ఏమి అంటున్నారు అంటే !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అఖండ మూవీ రివ్యూ :-  3 / 5

చాలా రోజుల తర్వాత పెద్ద హీరో సినిమా సినిమా ధియేటర్ లో సందడి చేయటంతో చిలకలూరిపేట లోని వి సెల్యూలాయిడ్ థియేటర్స్ అన్నీ పండుగ వాతావరణం నెలకొన్నది.

 ఇక సినిమా విషయానికొస్తే బోయపాటి తన మార్క్ ని చూపించాడు. సినిమాలోని క్యారెక్టర్స్ ను హై లెవెల్ ఓల్టేజితో చూపించటం బోయపాటికే సాధ్యం. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటికి తోడుగా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు ఒక రేంజిలో ఉంటాయి. ఆ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందనే చెప్పాలి. బాలకృష్ణ మాస్ ఎలిమెంట్స్ , డైలాగ్స్, ఫైట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైట్ సీన్స్, బాలకృష్ణ డాన్స్ ప్రేక్షకులకు ఉల్లాసాన్ని తీసుకొస్తాయి.శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ తో విలన్ పాత్రకు కొత్త రూపం తీసుకుని వచ్చాడు . తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాటలు చితక కొట్టేసాడు హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ అందం అభినయంతో ఆకట్టుకుంది పూర్ణ కూడా తన అందంతో నటనతో ఆకట్టుకుంది జగపతి బాబు తన పరిధి మేరకు మెప్పించాడు.

 మైనస్ పాయింట్ :- కథ సాగదీత

 చివరకు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ మరొకసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది. చిలకలూరిపేట ప్రజలు అఖండ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అంటే ఈ క్రింది వీడియోలో చూడండి.


Share:

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన పెడవల్లి అనిల్ (26) యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడని అనంతరం జాతీయ రహదారి పక్కనే ఉన్న అమృత మినరల్ వాటర్ ప్లాంట్ వెనుక ఉన్న ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. ఉదయం అటుగా వెళ్తున్న బాటసారులు జీవచ్ఛవంలా పడి ఉన్న మృతదేహాన్ని చూసి అనిల్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు అనిల్ విజయవాడలోని రాజకీయ నాయకుడి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నారని బంధువులు తెలిపారు‌.



Share:

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తి

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తి

చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారా పంపే విషయంలో పొరపాటు చేస్తున్నారని స్థానిక సబ్ ట్రెజరీ ఆఫీసర్ బి శ్రీనివాసరావు తెలిపారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జనవరి, ఫిబ్రవరి నెలలలో మాత్రమే పంపాలని ఆయన తెలిపారు. అయితే కొందరు పెన్షనర్లు ముందుగానే లైఫ్ సర్టిఫికెట్లను ఆన్ లైన్ ద్వారా పంపుతున్నారని, అవి చెల్లవని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కూడా కొందరు పెన్షనర్లు గడువు కంటే ముందే లైఫ్ సర్టిఫికెట్లను పంపడంతో అవి చెల్లక, వారు కొన్ని నెలలపాటు పెన్షన్ పొందలేకపోయారు ఆయన వివరించారు.




Share:

24/11/2021 to 28/11/2021 వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

24/11/2021 to 28/11/2021 వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి  విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారి ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా 24/11/2021 నుండి 28/11/2021 వరకు భారీ వర్షం సూచికల వలన ప్రజలందరూ అప్రమత్తమై బయటికి రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని... లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమై చిన్నపిల్లలను నీటి ప్రవాహానికి దూరంగా ఉంచుతూ .. వాగులు వంకలు ప్రవహించే ప్రాంతాలలో జాగ్రత్తలు వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు.



Share:

చిలకలూరిపేట మద్యం దుకాణంలో చోరీ

చిలకలూరిపేట మద్యం దుకాణంలో చోరీ

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని వేలూరు రోడ్డులో ఉన్న ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చోరీలో 2.32 లక్ష రూపాయల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎక్సైజ్ సీఐ భాష చోరీ జరిగిన  ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ఆ దుకాణానికి బాధ్యత వహిస్తున్న వ్యక్తి ఉద్యోగ భద్రతకై చోరీ జరిగిన మొత్తాన్ని చెల్లించాడు.




Share:

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారి సమీపంలోని లక్కీ రోడ్ లైన్స్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి విజయవాడ వెళుతున్న ఇందు బస్ ట్రావెల్స్ తెల్లవారుజామున గం 4:15 ఈ సమయంలో జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఈ ఘటనకు ముఖ్యకారణం డ్రైవర్ నిద్ర మత్తు వలన ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన లో ఐదుగురికి స్వల్ప గాయాలు అవగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఒక హుటిన ఘటనా స్థలానికి చేరుకొని స్వల్ప గాయాలైన వారికి అక్కడే చికిత్స అందించి తీవ్రగాయాలైన చంద్రమోహన్, కటారి సురేష్ బాబులను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.



Share:

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆయా ఏరియాలలో ఉండే సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు సోమవారం నాడు చిలకలూరిపేటలో పర్యటించారు రాజ్యసభ సభ్యుడు GVL నరసింహారావు. పట్టణంలోని బిజెపి నాయకులతో నిర్వహించిన చర్చల అనంతరం ఆయన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణానికి ప్రభుత్వం అనేక నిధులను కేటాయించిందని ముఖ్యంగా చిలకలూరిపేట బైపాస్ పనులు త్వరగా పూర్తిచేయాలని.. ఆలస్యానికి గల కారణాలను రాష్ట్ర మంత్రులతో చర్చించి త్వరగా బైపాస్ పనులు పూర్తిచేయాలని.. అలాగే చీరాల ఓడ రేవు నుండి చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట, పిడుగురాళ్ల వరకు బైపాస్ పనులను త్వరగా మొదలు పెట్టాలని కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కోరామని.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత పథకం కింద సుమారు 180 కోట్ల రూపాయలను కేటాయించిందని దానిద్వారా పట్టణంలోని అన్ని ఏరియాలకు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని.. అలాగే ప్రధానమంత్రి  ఆవాస్ యోజన కింద 4500 ఇళ్లను కేటాయించామని కానీ వాటిని ఇంకా అర్హులకు అందలేదని వాటిపై చర్చిస్తామని ఆయన తెలిపారు. అలాగే పట్టణంలోని పలు సమస్యలపై ఆయన చర్చించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పట్టణంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి