మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్

అచ్చెన్నాయుడి కోరిక మేరకు ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న - సీఎం జగన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి :- ఈరోజు 18/11/2021 బుధవారం నాడు అమరావతిలో అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సమావేశాలను ఈ ఒక్కరోజు మాత్రమే జరపాలని ముందు నిర్ణయించుకున్నారు. అయితే బీఏసి సమావేశంలో అసెంబ్లీ సమావేశం ఈ ఒక్కరోజు మాత్రమే అని స్పీకర్ తమ్మినేని సీతారాం అనగా.. వెంటనే తమకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని చర్చించుకోవాలి అని 15 రోజులు అయినా సమావేశాలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. వెనువెంటనే సీఎం జగన్ కలుగజేసుకుని పెద్దాయన అచ్చన్న అడిగినందుకు అయినా ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బదులిచ్చారు. అయితే సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని - అంతటితో ఆగకుండా చంద్రబాబు అసెంబ్లీ సమావేశం హాజరుకావాలని, ఆయన మొహం ఒకసారైనా చూడాలని ఉందని సీఎం జగన్ అచ్చన్నను కోరారు. చంద్రబాబు గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అచ్చెన్నాయుడు బదులిచ్చారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా "ఉమెన్ ఎంపవర్ మెంట్" టాపిక్ పైన చర్చించారు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి - ఎవరు ? ఎక్కడ !

అక్కడ కీలకంగా మారనున్న స్వతంత్ర అభ్యర్థి  - ఎవరు ? ఎక్కడ !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నికలలో మొత్తం 29 వార్డులకు గాను 14 టిడిపి 14 వైసిపి అభ్యర్థులు గెలిచి సమానంగా ఉన్నార. మిగిలిన ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అవటంతో ఏ పార్టీకి ఆమె మద్దతు ఇస్తే ఆ పార్టీ వారు అక్కడ మున్సిపాలిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి 10 వార్డ్ కడిమికొండ శ్రీలక్ష్మి (టిడిపి రెబల్) ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే శ్రీలక్ష్మి టిడిపి రెబల్ అవ్వటంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.



Share:

కరోనా కాలర్ ట్యూన్ విసుగు పుట్టిస్తుందా ? కాలర్ ట్యూన్ తీసివేయాలి అంటే ఇలా చేయండి

కరోనా కాలర్ ట్యూన్ విసుగు పుట్టిస్తుందా ? కాలర్ ట్యూన్ తీసివేయాలి అంటే ఇలా చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

యాక్సిడెంట్ జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేద్దామంటేనో, చనిపోయినప్పుడు బంధువులకు సమాచారం అందించేటప్పుడో, కోపం లోనో లేదా ఆనందంలోనో ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా మనకు చిరాకు తెప్పించే విషయం కరోనా కాలర్ ట్యూన్. దీనివలన మనం చెప్పాలనుకున్న విషయం చెప్పలేక కాలర్ ట్యూన్ మీద కోపంతో విసిగిపోయి ఉన్నారా !  అయితే ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు కరోనా కాలర్ ట్యూన్ వినబడితే వెంటనే 1 నొక్కండి అప్పుడు ట్యూన్ ఆగిపోయి రింగింగ్ శబ్దం వినబడుతుంది.

ఒకవేళ నీ ఫోన్ కి ఎవరైనా కాల్ చేసినప్పుడు వారికి కరోనా కాలర్ ట్యూన్ వినపడకుండా ఉండాలంటే !

BSNL :- UNSUB అని టైప్ చేసి 56700 & 56799 నెంబర్కు కు మెసేజ్ చేయండి.

AIRTEL :-CANCT అని టైప్ చేసి 144 ఈ నెంబర్ కు మెసేజ్ చేయండి.

JIO :- STOP అని టైప్ చేసి 155223 ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి.

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి.



Share:

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ - తృటిలో తప్పిన ప్రమాదం

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ -  తృటిలో తప్పిన ప్రమాదం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారిపై కారును ఢీకొన్న లారీ.. వివరాల్లోకి వెళ్తే  తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి తిరుపతి బయలుదేరిన కుటుంబం బొప్పూడి ఆంజనేయ స్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఉన్న స్పీడ్ రిసిస్టర్స్ వద్ద కారును స్లో చేయగా, వెనక నుండి వచ్చిన లారీ కారును ఢీ కొనడంతో కారు డివైడర్ పై ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ఘటనలో కారు వెనుక భాగంతో పాటు ముందు భాగం కూడా ధ్వంసం అవ్వగా లోపలున్న ప్రయాణికులకు ప్రాణాలతో బయటపడ్డారు. కారు వేగం తగ్గడంతో ప్రమాద స్థాయి తక్కువగా ఉన్నదని స్థానికులు చెబుతున్నారు.



Share:

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

కుప్పంలో కుప్పకూలిన టిడిపి - చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండా

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చంద్రబాబు నాయుడు కంచుకోట అయిన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసిపి తన హవా కొనసాగించింది. ఎలక్షన్ మొదలైనప్పటి నుండి చివరి వరకు అందరి దృష్టి కుప్పం మున్సిపాలిటీ పై ఉన్నది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కుప్పం కోటపై వైసీపీ జెండా ఎగరవేశాయి అక్కడి వైసీపీ శ్రేణులు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు మొత్తం 24 వార్డుల గాను ఒక వార్డు ఏకగ్రీవం అవగా 12 వార్డులలో వైసిపి అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇప్పటివరకు వైసిపి 13 అభ్యర్థులను గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. 2 టిడిపి అభ్యర్థులు గెలిచి ఉన్నారు. మిగిలిన వార్డుల్లో టిడిపి ఆదిక్యత చూపిస్తుంది.



Share:

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వీలులేదా? - TNSF విద్యార్థి సంఘాలు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను రాష్ట్రంలో శాశ్వతంగా లేకుండా చేయడానికి జారీ చేసిన జీవో నెం.50,51 నిరసిస్తూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఏకపక్ష ధోరణితో  ఎయిడెడ్ పాఠశాలల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ ల వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయు కార్యక్రమాన్ని తలపెడితే, అప్రజాస్వామికంగా విద్యార్థి సంఘాల నేతలను కనీసం శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా అనుమతించకుండా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,  ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రాని నడపడానికి అప్పులు  దొరకని తరుణంలో ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూముల్ని స్వాధీనం చేసుకుని వాటితో అప్పులు తెచ్చుకోవాలని చూడండం దారుణం అన్నారు. నాడు అమ్మఒడి ఇస్తామని అధికారంలోకి వచ్చి  నేడు అమ్మకానికి బడిని పెట్టడం సిగ్గుచేటు అన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల భూములు స్వాధీనం చేసుకోవాలని తీసుకువచ్చిన జీవో నెం.50, 51లను రద్దు చేయకపోతే  విద్యార్థులుతో మరియు యువజన సంఘలుతో  కలిసి ఈ నెల 18న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చెప్పడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర TNSF కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జాకీర్ హుస్సేన్, గుంటూరు పార్లమెంట్ TNSF అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ, నరసరావుపేట పార్లమెంట్ TNSF అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు మరియు పలు TNSF విద్యార్థి సంఘాలు పాల్గొనడం తదితరులు జరిగింది.



Share:

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక జాలయ్య కాలనీకి చెందిన ఐదు కుటుంబాలు గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తుంటారు. ఉన్నట్టుండి ఈరోజు ఉదయాన్నే 35 గొర్రెలు ఎక్కడికక్కడ విగత జీవులై పడి ఉండటంతో వారు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. మరో 10 గొర్రెలు అస్వస్థతతో ఉండటంతో గమనించిన యజమానులు హుటా హుటిన వెటర్నరీ హాస్పటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని వైద్యశాలకు చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. డాక్టర్ చెప్పిన సమాచారం మేరకు గొర్రెలు ప్లాస్టిక్ కవర్లను, ఇతర కలుషిత పదార్థాలను తినడం వల్ల మరణించాయని ఆయన తెలిపారు. చనిపోయిన 35 గొర్రెలు విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని అంచనా ! అస్వస్థతతో ఉన్న 10 గొర్రెలను ప్రాణాలతో కాపాడాలని షేక్ రఫాని వెటర్నరీ వైద్యులకు తెలిపారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి