మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

మహా పాదయాత్రకు తండోపతండాలుగా వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక... - మీడియా సమావేశంలో CM పై విరుచుకుపడిన ప్రత్తిపాటి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


మాజీ మంత్రి ప్రత్తిపాటి ఇంట్లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో - అమరావతి రైతులు తలపెట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర అడ్డుకునే ప్రయత్నం కుట్రకు తెరలేపింది -  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల్ని అడ్డంపెట్టుకొని పాదయాత్ర అడుగడుగునా అడ్డంకులు కలుగజేసి, ఆరు రోజులు గుంటూరు జిల్లాలో తండోపతండాలుగా ప్రజలు రావటం చూసి మహాపాదయాత్ర ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక జగన్ మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని దుర్మార్గమైన ఆలోచనలకి తెరలేపుతున్నారు. ఆ రైతులు కన్నీరు పెట్టి దగ్గర బాగుపడ్డటు చరిత్రలో లేదు. అమరావతి రైతులు పాదయాత్ర అడ్డుకోవాలనే పన్నాగం పన్నాడు. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 35 వేల ఎకరాలు ఉంటే రాజధానికి బాగుంటుందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అమరావతిలో ఇల్లు కట్టుకుందామని మాటలు చెప్పాడు. నిజమేనని నమ్మి అమరావతి రైతులు ఆనాడు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాటమార్చి రైతులను బాధలకు గురి చేసి, వారు చేస్తున్న దీక్షలు కూతవేటు దూరంలో ఉన్న పట్టించుకోకుండా పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. అమరావతి రైతులు తిరుపతి దేవస్థానానికి వెళుతుంటే పోలీసులు అడ్డం పెట్టుకొని వ్యవహరించటం చాలా దుర్మార్గమైన చర్య. హైకోర్టు అమరావతి రైతులు పర్మిషన్ తెచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వలేదు. ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని గ్రహించాలి. ఇది ఒక అమరావతి రైతులే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు అమరావతి రైతులకు అండగా ఉండాలి. అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై  విరుచుకుపడ్డారు.గతంలో ప్రభుత్వాలు పేదలకు 1983 నుంచి గృహాలు & స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, ఆ స్థలాల మీద 10 వేల నుంచి 15 వేల రూపాయల కట్టమని పేద ప్రజలను భయభ్రాంతులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. పేద ప్రజల దగ్గరికి వెళ్లి వాలంటరీ వారు డబ్బులు కట్టాల్సిందే కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. అని ప్రజల్ని ఎప్పుడూ ఇచ్చిన గృహాలు స్థలాల మీద ఇలా టాక్స్ వెయ్యటం ఎంతో ఘోరమైన చర్య జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు గృహాలు కట్టిస్తాం, స్థలాలు ఇస్తాం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు డబ్బులు వసూలు చేయటం దారుణం‌ అని, కట్టిన గృహాలు సాక్షాత్తు చిలకలూరిపేట 52 ఎకరాలలో 4600 గృహాలు నిర్మాణం పూర్తయి ఉంటే ఇంతవరకు లబ్ధిదారులకు అందించలేదు. పాడుబడ్డ విధంగా ఆ గ్రహాలు ఇప్పుడు ఉన్నాయి. అధికారంలోకి రాకముందు మేము అధికారంలో రావడంతో అన్ని రుణమాఫీ, గృహాలకు రూపాయి కట్టే పని  లేకుండా చేస్తామని చెప్పి, పేద ప్రజల చేత ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు. పేద ప్రజల ఏమో అప్పోసప్పో చేసి యాభై రెండు ఎకరాల గృహాల కోసం డబ్బులు కొంత డబ్బులు కట్టారు. ఆ డబ్బులు వడ్డీలు కట్టలేక ఈ గృహాలు రాక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇలా వాలంటరీ వారిచేత పేద ప్రజల దగ్గర డబ్బులు ముక్కుపిండి వసూలు చెయ్యటం ఎంత  దుర్మార్గమైన చర్య. ఈ చర్య కు తెర లెపేలా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించటం ఎంత దారుణమైన చర్య, అంటూ తక్షణమే పేదలకు న్యాయం జరిగేలా ఉండాలి. వారి గృహాల వారికి అందించాలి. డబ్బులు వసూలు చేయటం తక్షణమే ఆపివేయాలి. అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారి పై  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు.




Share:

ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పేట YSRCP ఆధ్వర్యంలో వేడుకలు - అనంతరం ర్యాలీ

ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా పేట YSRCP ఆధ్వర్యంలో వేడుకలు - అనంతరం ర్యాలీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

CM జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ 4 సంవత్సరాలు అయిన సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో ఎమ్మెల్యే విడుదల రజిని ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ నిర్వహించి, అనంతరం పార్టీ శ్రేణులతో ర్యాలీని నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రజిని హీరో షోరూం ఎదురుగా ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు.



Share:

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు

న్యాయస్థానం టు దేవస్థానం ప్రజా పాదయాత్ర - మద్దతు తెలిపిన TDP,కాంగ్రెస్, వామపక్షాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి రాజధాని రైతులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో పాల్గొన్న టిడిపి, కాంగ్రెస్, వామపక్ష నేతలు పట్టణంలోని nrt సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు .

ర్యాలీలో పాల్గొన్న మాజీ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ద్వారా రాజధాని రైతుల బాధలను తెలుసుకొని పునరాలోచన చేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన కోరారు. ర్యాలీగా వెళ్లి పెదనందిపాడు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాధాకృష్ణ, సిపిఐ నాయకురాలు నాగభైరు సుబ్బాయమ్మ, ప్రజా సంఘాల నేతలు, అమరావతి మద్దతుదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.



Share:

గుంటూరు YSRCPలో భగ్గుమన్న రాజకీయం - దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేసి గెలవాలి - మద్దాలి గిరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరపత్రాలు

గుంటూరు YSRCPలో భగ్గుమన్న రాజకీయం - దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా రాజీనామా చేసి గెలవాలి - మద్దాలి గిరి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కరపత్రాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి టిడిపి నుండి గెలిచి YSRCP కండువా తప్పుకున్న విషయం అందరికీ తెలిసినదే. గుంటూరు మేయర్ పదవి ప్రకటించే ముందు రెండున్నర సంవత్సరం కావటి మనోహర్ నాయుడు మరో రెండున్నర సంవత్సరం పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కేటాయిస్తున్నట్లు అప్పట్లో గుంటూరు YSRCP తెలిపింది. అయితే పాదర్తి రమేష్ గాంధీ గుండెపోటుతో మరణించడం తో ఆరో వార్డు జరగవలసిన ఉప ఎన్నికలకు టిడిపి నుండి వైసిపికి వచ్చిన మద్దాలి గిరి పెత్తనం చేస్తున్నారంటూ స్థానిక వైయస్సార్ సిపి కార్యకర్త గుజ్జుల రామకృష్ణారెడ్డి మద్దాలి గిరి విమర్శిస్తూ కరపత్రాలు ప్రచురించారు. ఆరవ వార్డు స్థానికులకు కాకుండా మద్దాల గిరి సొంత ఊరైన రెంటచింతల నుండి వ్యక్తిని తీసుకొనివచ్చి అభ్యర్థిగా ప్రకటించడం తో ఈ వివాదం చెలరేగింది. సదరు వ్యక్తి గుట్కా సప్లై చేస్తూ అక్రమంగా డబ్బులు డబ్బులు సంపాదిస్తారు అని, స్థానికులకు కాకుండా స్థానికేతరులను ఎలా అభ్యర్థి గా పర్యటిస్తారని అసహనం వ్యక్తం చేశారు. టిడిపి నుండి Ysrcp కండువా కప్పుకున్నారు అని, దమ్ముంటే ఈటల రాజేందర్ లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. పాదర్తి రమేష్ గాంధీ మేయర్ పదవి కోసం మద్దాలి గిరి నాలుగు కోట్లు డిమాండ్ చేశారని ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన గుండెపోటుతో మరణించారని ఆయన తెలిపారు. దీంతో ఒక్కసారిగా గుంటూరు నగర వైఎస్సార్సీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.




Share:

6 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ పైన ఆధారపడిన టీం ఇండియా సెమీస్ ఆశలు

6  ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేసిన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ పైన ఆధారపడిన టీం ఇండియా సెమీస్ ఆశలు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. అందులో మొదటి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ తడబడింది. 17.4 ఓవర్లకు 10 వికెట్ల నష్టానికి 85 స్కోర్ చేసింది. తరువాత దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్ శర్మ 16 బంతులకు 30 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 18 బంతులకు 50 పరుగులు చేశాడు. చివరలో వచ్చిన  సూర్యకుమార్ యాదవ్ సిక్స్ బాది మ్యాచ్ ముగించారు. 6.3 ఓవర్లకు భారత్ మ్యాచ్ ఫినిష్ చేసింది. ఆదివారం జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ & న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, భారత్ & నమీబియా మధ్య జరగబోయే మ్యాచ్ భారత్ గెలిస్తే టీమిండియా సెమీస్కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇందులో ఏది తడబడినా టీమిండియా ఇంటి బాట పట్టాల్సిందే.



Share:

కదలిరండి అమరావతి రైతుల మద్దతుదారులారా - చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ

కదలిరండి అమరావతి రైతుల మద్దతుదారులారా - చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అమరావతి మాత్రమే రాజధాని కాదు అంటూ మొత్తం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో అమరావతిలో వేల ఎకరాల భూములు దానం చేసిన రైతులు ఖంగు తిన్నారు. నాటి నుండి మొదలుకొని ఇప్పటికీ దీక్షలు చేస్తున్న - రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోగా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీక్ష చేస్తున్నారంటూ రైతులు చేసే దీక్షను పక్కదోవ పట్టిస్తున్నారని, న్యాయపోరాటానికి "న్యాయస్థానం టు దేవస్థానం" అనే నినాదంతో అమరావతి రైతులు పాదయాత్ర  మొదలుపెట్టారు. అందులో భాగంగా రేపు అనగా 6/11/2021 శనివారం నాడు పెదనందిపాడు చేరుకోనున్నారు. రేపు ఉదయం మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీ గా పెదనందిపాడు తరలిరావాలని - నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మరియు అమరావతి రైతుల మద్దతుదారులు ఈ పాదయాత్రలో భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి - 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని రైతులు గళాన్ని వినిపించాలి అని చిలకలూరిపేట టిడిపి పిలుపునిచ్చింది. నియోజకవర్గం పరిధిలోని వార్డు, మండల, జిల్లాస్థాయి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు-

 ఇట్లు 

తెలుగుదేశం పార్టీ 

చిలకలూరిపేట నియోజకవర్గం.





Share:

చిలకలూరిపేట :- కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

చిలకలూరిపేట :- కార్తీక మాసం విశిష్టత... పాటించాల్సిన నియమాలు..!!

తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని 'ధర్మసింధువు' గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

హరిహరాదులకు ప్రీతికరం... కార్తీక మాసం

మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ''ఆశుతోషుడు'' అనే బిరుదు వచ్చింది.

ఉపవాసం,స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి.విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు.నారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు.

ఇవి చేస్తే మంచిది:

ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారంరోజైనా నియమనిష్టల తో ఉపవాసం ఉండి,గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభిం చే పుణ్యఫలాన్ని వర్ణిం చడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహారణలను బట్టి తెలుసుకోవచ్చు.

ఇవి చేయరాదు:

తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోరాదు.ఎవ్వరికీ ద్రోహం చేయరాదు.పాపపు ఆలోచనలు చేయకూడదు.దైవ దూషణ తగదు.దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు.కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.

కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌబాగ్యాలు సిద్దిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.





Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి