మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ఆ రాష్ట్రాలలో పెట్రోల్ పై 12 రూ" డీజిల్ పై 17 రూ'' తగ్గిన ధరలు - మరి మన రాష్ట్రంలో ! ?

ఆ రాష్ట్రాలలో పెట్రోల్ పై 12 రూ" డీజిల్ పై 17 రూ'' తగ్గిన ధరలు - మరి మన రాష్ట్రంలో ! ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ భారత ప్రభుత్వం పెట్రోల్ పై 5 డీజిల్ పై 10 రూపాయల వ్యాట్ తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాట్ తగ్గించారు. కర్ణాటక, గోవా, మణిపూర్, యానం, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాష్ట్రాలలో 7 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాయి దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్ పై 12 రూపాయలు డీజిల్ పై 17 రూపాయల భారం తగ్గింది.

ఇదిలా ఉంటే ఆంధ్ర & తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను తగ్గిస్తాయి ఏమో అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో జగన్ సర్కార్ పెట్రోల్ పై 31 రూపాయలు, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పెట్రోల్ పై 26 రూపాయల vat వసూలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని సర్కార్ లు ఇంధన ధరల పై వ్యాట్ తగ్గిస్తే వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.



Share:

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

నిప్పు లేకుండానే పేలుతున్న టపాసులు !!!

దీపావళి అంటేనే బాణాసంచా, దీపాల అలంకరణ, పూజా కార్యక్రమాలు లాంటివి ఉంటాయి. అందులో ముఖ్యంగా టపాసు లేకుండా దీపావళి జరుపుకోవాలంటే అది పండుగలాగే ఉండదు. అయితే గత సంవత్సరం కోవిడ్ కారణంగా దీపావళి బాణాసంచా విక్రయాలు కొంతమేర తగ్గాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి లాక్ డౌన్ లేకపోవడంతో బాణాసంచా కాల్చటానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం నిప్పు లేకుండానే టపాసులు పేలుతున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా మీరు విన్నది నిజమే నిప్పు లేకుండా టపాసులు ఎలా పేలుతుంది అనుకుంటున్నారా !

టపాసులు కొనడానికి వెళ్లిన వినియోగదారులు ఈ మాటే అంటున్నారు. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం బాణసంచా డబల్ రేట్ ఉండటంతో సామాన్యులు టపాసులు కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఒక సామాన్యుడు దీపావళి పండుగ రోజు సాయంత్రం సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని సాయంత్రం 7 సమయంలో కుటుంబంతో పాటు బాణాసంచా కాల్చుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం బాణాసంచా రేట్లు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు 1000 & 1500 రూపాయలకు మనకు కావాల్సిన చిచ్చుబుడ్లు క్రాకర్స్ ఇతర టపాసులు లాంటివి తెచ్చుకొని మూడు రోజులపాటు సాయంత్రం సమయాల్లో వాటిని కాలుస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం తక్కువలో తక్కువ గా 4000 నుండి 5000 రూపాయల వరకు వెచ్చించవలసిన వస్తుంది. అమ్మకందారులు ట్రాన్స్పోర్టేషన్, పెరిగిన ఇంధన ధరలు వలన ఈ రేట్లు తప్పవని చెబుతున్నారు. ఏది ఏమైనా టపాసు లేని దీపావళి ఊహించుకోలేము కదా! 




Share:

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

చిలకలూరిపేట: నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ముఖ్య నాయకులు & పోలీస్ శాఖ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

*MLA విడదల రజిని :- 

దీపావళి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని, ఈ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.

మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు :-

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, దీపావళి తెలుగు లోగిళ్లలో ఆనందమయ కాంతులు వెదజల్లాలని ఆకాంక్షించారు. కార్తీక దీపకాంతులకు నాందిపలికే దీపావళిని సంబరంగా స్వాగతించాలి. తెలుగువారందరికీ సర్వ శుభాలు, శాంతి, సౌభాగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. మనిషిలో రాక్షసత్వం పోవాలని, మానవత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు, టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా జాగ్రత్త తీసుకోవాలని, టపాసులు కాల్చిన తర్వాత చేతులు కడుక్కోవటానికి సబ్బును ఉపయోగించoడి. సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా ఇంకా ఉనికిలో ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్:-

నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రతి కుటుంబాలలో వెలుగు నింపాలని ఆయన కోరారు.

టౌన్ సిఐ రాజేశ్వరరావు:- 

పట్టణ ప్రజలందరికీ చిలకలూరిపేట టౌన్ పోలీస్ శాఖ దీపావళి శుభాకాంక్షలు. ప్రజలందరూ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్ వాడకుండా, చిన్నపిల్లల దూరంగా ఉంచుతూ సంబరాలు చేసుకోవాలి. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలి.




Share:

చితక్కొట్టిన భారత్ - కానీ!!!

చితక్కొట్టిన భారత్ - కానీ!!!

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ప్రపంచ కప్ టీ20ల్లో మొదటి రెండు మ్యాచుల్లో భారత్ తడబడింది కోహ్లీ సేన న్యూజిలాండ్ పాకిస్తాన్ లతో జరిగిన పోరులో భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయి విమర్శల పాలయింది. గడిచిన రెండు మ్యాచ్ లలో టాప్ ఆర్డర్స్ విఫలమవటంతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈరోజు జరిగిన ఆప్ఘనిస్తాన్ భారత్ మ్యాచ్ లో భారత్ వీర విజృంభించింది. కేఎల్ రాహుల్ 48 బంతులకు 69 రన్స్ చేయగా, హిట్ మాన్ రోహిత్ శర్మ 47 బంతులకు 74 పరుగులు చేశారు. తరువాత వచ్చిన పంత్ 13 బంతులకు 27 పరుగులు, హార్దిక్ పాండ్యా 13 బంతులకు 35 పరుగులు చేశాడు. మొత్తంగా చూసుకుంటే 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 210 భారీ స్కోరు ఆఫ్ఘనిస్తాన్కు టార్గెట్ గా ఇచ్చారు అందులో 10 సిక్స్ లు 19 ఫోర్స్ బాదారు.

తరువాత బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 20 వరకు 7 వికెట్ల కష్టానికి 144 పరుగులు చేసింది. కానీ టీమ్ ఇండియా సెమీస్కు చేరుకోవటం కష్టం. నవంబర్ 5న స్కాట్లాండ్ తో నవంబర్ 8న నమీబియా తో టీమిండియా ఆడనుంది.



Share:

గుడ్ న్యూస్ - భారత ప్రభుత్వం భారీగా తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరలు రేపటి (దీపావళి రోజు) నుండి అమల్లోకి

గుడ్ న్యూస్ - భారత ప్రభుత్వం భారీగా తగ్గించిన పెట్రోల్ డీజిల్ ధరలు రేపటి (దీపావళి రోజు) నుండి అమల్లోకి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. తాజాగా భారత ప్రభుత్వం దీపావళి సందర్భంగా పౌరులకు రేపటి నుండి అనగా దీపావళి పండుగ నుండి పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ఇంధన ధరలు రేపటి నుండి ధరలు అమలులోకి వస్తాయి. ఈ ఒక్క పూట ఆగి రేపు ఉదయం మీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ గుర్తించుకోండి.



Share:

చిలకలూరిపేట: దీపావళి టపాసుల హోల్ సేల్ షాపులలో తనిఖీలు - రాత్రి 10 లోపు మాత్రమే బాణసంచా కాల్చలి - DSP

చిలకలూరిపేట: దీపావళి టపాసుల హోల్ సేల్ షాపులలో తనిఖీలు - రాత్రి 10 లోపు మాత్రమే బాణసంచా కాల్చలి - DSP

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణ పరిధిలోని దీపావళి బాణాసంచా హోల్ సేల్ దుకాణాలలో డి.ఎస్.పి విజయ భాస్కర్ తనిఖీలు నిర్వహించారు. వీటితో పాటు రూరల్ సీఐ సుబ్బారావు పాల్గొన్నారు. హోల్ సేల్ దుకాణాలలో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా ! షాపు లైసెన్సులు, అత్యవసర అగ్నిమాపక సహాయక చర్యలను పరిశీలించారు. దుకాణదారులకు షాపులు చుట్టుపక్కల ఫైర్ యాక్టివిటీలు, ధూమపానం చేయకుండా చర్యలు తీసుకోవాలని అని ఆయన తెలిపారు. అలాగే దీపావళి బాణాసంచా కాల్చె సమయంలో చిన్నపిల్లలను జాగ్రత్తగా కలుసుకోవాలని, రాత్రి 10 గంటల లోపు మాత్రమే బాణసంచా కాల్చాలని ఆయన తెలిపారు.



Share:

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

లండన్ లో మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న మన తెలుగు కృష్ణ తేజం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన IAS మైలవరపు కృష్ణ తేజ అవార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా లండన్ హై స్పీడ్ డైవర్సిటీ కార్యక్రమంలో  మన కృష్ణతేజకు అవార్డుని అందజేశారు. ప్రస్తుతం కేరళ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. కేరళలో "అయమానం" గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుకు (WTM) 'వరల్డ్ ట్రావెల్ మార్కెట్' అవార్డు లభించింది. కేరళ లో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ఈ మిషన్ అయమనం ప్రాజెక్టుకు అవార్డు దక్కడంతో కేరళ పర్యాటక శాఖ అధికారి మహమ్మద్ రియాజ్ ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ అవార్డు తమ రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే కృష్ణ తేజ పదునైన ఆలోచనలను అవలంబించడం వలన ఇలాంటి అవార్డులు తమకు దక్కాయని వారు తెలిపారు. కృష్ణ తేజ తనకు అప్పగించిన బాధ్యతలను తన ఆలోచనలను కలుపుకొని సంపూర్ణంగా నిర్వహించడం వలన ఈ యొక్క అవార్డే కాదు గతంలోనూ పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కేరళలో వరదలు మొదలుకొని & కోవిడ్ నియంత్రణను చర్యలను చేపట్టడంలో మైలవరపు కృష్ణ తేజ తనకు తానే సాటి అని - ఈనాడు లండన్లో ఈ అవార్డును అందుకోవడంతో మరోసారి మన తెలుగువారి ఘనతను విదేశాల్లో కూడా చాటిచెప్పారు. ఇలాంటి అవార్డులు మరెన్నో పొంది తెలుగువారి కీర్తిని దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల తెలియజేయాలని కోరుకుంటూ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి