మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ  - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

నాటి కన్నడ సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలను కనుసైగలతో శాసించిన కంఠీరవ రాజ్ కుమార్ మూడవ కుమారుడు కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా నిన్న మరణించడంతో యావత్ కర్ణాటక రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సాధారణంగా ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులు చాలా యాటిట్యూడ్, రిచ్నెస్ మెయిటింగ్ చేస్తూ ఉంటారు. అయితే అది ఏమీ తనకు వంట పట్టించుకోకుండా చాలా సింపుల్ గా జీవితం సాగిస్తూ కన్నడ మరియు దక్షిణ భారతదేశం ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తన మరణ వార్త విన్న భారతదేశం చిత్ర పరిశ్రమ అతనితో ఉన్నా అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అలాగే తమిళం, తెలుగు లో ఉన్న స్టార్ హీరోలతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నారు. అయితే ఈరోజు నందమూరి బాలకృష్ణ పునీత్ పార్థివ దేహాన్ని చూడటానికి బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. అయితే అక్కడ విగతజీవిగా ఉన్న పునీత్ ను చూసి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. సాయంత్రానికి తెలుగు పరిశ్రమ నుండి ఎన్టీఆర్, చిరంజీవి,రాణా లాంటి ప్రముఖులు పునీత్ అంతిమయాత్ర లో పాల్గొననున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మోహన్ బాబు మరియు చాలామంది ఇది సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సంఘీభావం తెలిపారు.

ఆయన మృతి పట్ల కన్నడ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బెంగళూరు వ్యాప్తంగా వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ మూడు రోజుల పాటు బంద్ ప్రకటించారు. పునీత్ కుమార్తె అమెరికాలో చదువుతున్న కారణంగా ఆమె ఈరోజు సాయంత్రానికి బెంగళూరు చేరుకొన్నది. నిన్నటి సాయంత్రం నుండి కంఠీరవ స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసి పోయింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సినీ ప్రముఖులు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖులు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.







Share:

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ఖరారు చేశారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. పునీత్ రాజ్ కుమార్ జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని తెలపడంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ ఆరోగ్య పరిస్థితిపై కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాలుగు గంటల క్రితమే పునీత్ రాజ్ కుమార్ బజరంగీ-2 సినిమా సూపర్ హిట్ అయినందుకు చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు తెలిపారు. పునీత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా విక్రమ్ ఆసుపత్రికి చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.. సీనియర్ పోలీస్ అధికారులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు.. అలాగే పునీత్ రాజ్ కుమార్ నివాసానికి సైతం భద్రత కల్పించారు.. పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కుమార్తె నివేదిత.. పునీత్ కుటుంబ సభ్యులు.. క్రేజీ స్టార్ రవిచంద్రన్, నిర్మాతలు జయన్న, కేపీ శ్రీకాంత్ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి చేరుకుని పునీత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్.. యువరత్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పునీత్.



Share:

చిలకలూరిపేట:- భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్తాపంతో భర్త ఆత్మహత్య

చిలకలూరిపేట:- భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్తాపంతో భర్త ఆత్మహత్య

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి గ్రామం నందు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య - వివరాల్లోకి వెళితే బొప్పూడి గ్రామంలోని ఖాదర్ మస్తాన్ అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యతో గోడవ పడుతూ కొట్లాటలు జరుగుతుంటాయి. వేధింపులకు భరించలేని భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన ఖాదర్ మస్తాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడకు చేరుకొని మస్తాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి చేయి దాటడంతో వారు గుంటూరు ఆస్పత్రికి తరలించారు చివరికి చికిత్స పొందుతూ గురువారం నాడు మృతి చెందాడు.



Share:

చిలకలూరిపేట - పట్టణంలో ఆపరేషన్ జీరో వేస్టేజ్ - ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ / డ్రై డే - ఫ్రైడే

చిలకలూరిపేట - పట్టణంలో ఆపరేషన్ జీరో వేస్టేజ్ - ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ / డ్రై డే - ఫ్రైడే 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్పర్సన్ ఆదేశాల మేరకు స్వచ్ఛ చిలకలూరిపేట సాధించాలని ప్రతిరోజు ఒక వార్డుని ఎంచుకొని వార్డు పరిసరాలలో చెత్తాచెదారం, పాడుబడ్డ బావులు, డ్రైనేజీ కాలువలు, మురికి కాల్వలను, క్లీన్ చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలోని ప్రజలందరూ కచ్చితంగా డ్రై డే - ఫ్రైడే పాటించాలని కోరారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉంచే ప్రదేశాలను వారానికి ఒకరోజు పొడిగా ఉంచాలని వారు కోరారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం కోసం ఇల్లల్లో ఉండే చెత్తను పరిసరాలలో వేయకుండా మున్సిపాలిటీ చెత్త వాహనాలను ఉపయోగించుకోవాలని అని కోరారు. అలాగే డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పుర ప్రజలందరూ సహకరించాలని కోరారు. వార్డులోని పాడుపడ్డ బావులను శుభ్రపరిచి అందులో గంబూష చేపలను ఏర్పాటు చేసి దోమల బెడద లేకుండా చేస్తామని అని వారు తెలిపారు. ఈ చేపల వలన దోమల లార్వా ను (గుడ్డు) అది తిని వేస్తుందని. తద్వారా దోమల వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చని వారు తెలిపారు.

             * VIDEO*



Share:

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తరువాత నుండి దేశంలో ఇంధనం రేట్లు ఆకాశానికి వెళ్తున్నాయి. అయితే గత నెల సెప్టెంబర్ 28 నుండి ఈనెల అక్టోబర్ 28 వరకు మొత్తం 24 సార్లు ఇంధనం రేట్లు పెరిగాయి. అందులో పెట్రోల్ పైన 7.11రూ  డీజల్ పైన 8.43రూ పెరిగాయి. దేశంలో ఒక్క నెలలో ఇన్ని సార్లు ఇంత మొత్తంలో ఇంధనం రేట్లు పెరగటం ఇదే మొదటిసారి. చమురు రేట్లు ఈ విధంగా పెరగటంతో నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంధనం రేట్లకి అడ్డుకట్ట ఎప్పుడు వేస్తారు అని సామాన్యులు లబోదిబో మంటున్నారు.



Share:

చిలకలూరిపేట:- టౌన్ & రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

చిలకలూరిపేట:-  టౌన్ & రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ 

చిలకలూరిపేట అర్బన్ & రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు భాగంగా ఈరోజు విద్యార్థులతో పట్టణంలోని ప్రధాన కుడళ్ళు అయిన NRT సెంటర్ నుండి చౌత్ర సెంటర్ మీదగా కళామందిర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నరసరావుపేట డి.ఎస్.పి విజయ భాస్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అమరవీరుల త్యాగాలను కొనియాడారు విద్యార్థులు అందరూ కార్యక్రమానికి సహకరించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రాజేశ్వరరావు, రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు మోహన్, ఫిరోజ్, రాజేష్ మరియు హోం గార్డ్లు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట స్క్రబ్ మెంటల్ డీలర్ స్టోరేజ్ నందు అగ్ని ప్రమాదం

చిలకలూరిపేట స్క్రబ్ మెంటల్ డీలర్ స్టోరేజ్ నందు అగ్ని ప్రమాదం 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని NRT సెంటర్ నందు ఉన్న ఒక స్క్రబ్ మెటల్ డీలర్ స్టోరేజ్ నందు అగ్ని ప్రమాదం సంభవించింది. Nrt సెంటర్ లోని నవయుగ వైన్స్ పక్కనే ఉన్న స్క్రబ్ స్టోరేజ్ నందు మంగళవారం ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు యజమానికి మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే అక్కడ ఉన్నటువంటి పాత సామాను, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, సీసాలు, చాలా వరకు దగ్ధమయ్యాయి. అయితే భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి