చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-2021 శనివారం నాడు మొత్తం 2 కేసులు నమోదు అయ్యాయి.
వాటి వివరాలు.
బొబ్బిలి సత్యనారాయణ వీధి - 1
సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యాయి.
Advertisement - 1
........
Advertisement - 2
........
Advertisement - 3
........
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండిచిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-2021 శనివారం నాడు మొత్తం 2 కేసులు నమోదు అయ్యాయి.
వాటి వివరాలు.
బొబ్బిలి సత్యనారాయణ వీధి - 1
సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను
చిలకలూరిపేట రోష్ని సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐ.వి బాధిత పిల్లలకు ప్రతినెల పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టౌన్ సిఐ రాజేశ్వరరావుగారి చేతుల మీదగా పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని తెలిపారు. అలాగే తన వంతు సాయాన్ని ప్రతి నెల అందజేస్తానని తెలిపారు. మంచిగా చదువుకొని పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు
చిలకలూరిపేట: రేపు అనగా 09-10-21 రెండోవ శనివారం నరసరావుపేట 132/33 కేవీ సబ్ స్టేషన్ , నరసరావుపేట ఫీడర్ మరమత్తులు కారణంగా
నాదెండ్ల మండలం లోని అమీన్ సాహెబ్ వారిపాలెం, కనపర్రు, బసికాపురం, మైనంపాడు, కొత్తపాలెం ST కాలనీ, ఇర్లపాడు,ఎండుగుంపాలేం, బుక్కా పురం, రాజుగారి పాలెం,గున్నవారిపాలెం, గోవిందపురం, కొత్తపాలెం గ్రామాలకు గృహ, వాణిజ్య, వ్యవసాయ ,చిన్న మరియు బారి పరిశ్రమలకు , మరియు చిలకలూరిపేట మండలంలోని కావూరు గ్రామంలోని పరిశ్రమల తో పాటు
మద్దిరాల, పసుమర్రు, బొప్పూడి సబ్ స్టేషన్ లో మరమత్తులు కారణంగా చిలకలూరిపేట రూరల్ మండల. పరిధిలోని మద్దిరాల, పోతవరం,రా జాపేట, యడవల్లి, మురికిపూడి, తాతపూడి, ఈటి,కట్టుబడివారిపాలెం, గోపాలం వారి పాలెం, బోప్పూడి,బోప్పూడి హైవే,రామచంద్రాపురం, చిన పసుమర్రు, గుదేవారి పాలెం, మనుకొండవారిపాలెం, మిట్టపాలెం, కొత్తపాలెం, నాగబైరవారిపాలెం, గొరంట్లవారిపాలెం, దండమూడి, ఉప్పలపాడు గొట్టిపాడు గ్రామాలకు గృహ, వాణిజ్య, పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
నా పై MPTC కుట్రలు,వేధింపులకు పాల్పడుతున్నాడు - చిలకలూరిపేట మహిళ వాలంటీర్ ఆవేదన
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలోని ఒకటో వార్డు మహిళ వాలంటీర్ పై ఎంపీటీసీ వేధింపులకు పాల్పడుతున్నారు అని సదరు మహిళ వాలంటీర్ సీఎం జగనన్నకు ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. తన పేరు చెవుల యామిని నాదెండ్లలో ఒకటో వార్డు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నానని.అయితే అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ అయినా గుడికందుల ఎల్లారావు తనపై కుట్రలు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె వీడియోలో తెలిపారు. దళిత వర్గానికి చెందిన తాను టిటిసి పూర్తి చేసి వాలంటర్ పనిచేస్తూ వచ్చే ఐదు వేల జీతంతో ఇంట్లో వాళ్ళ పై ఆధారపడకుండా డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపారు. తల వాలంటరీ ఈ పోస్ట్ ను తీసివేసి తన స్థానంలో ఎంపీటీసీ ప్రియురాలి కుమార్తెను వాలంటరీ చేయాలనే ఉద్దేశంతో తనపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఉద్దేశంతో తాను సరిగ్గా పని చేయట్లేదు సమయానికి స్పందించలేదు అనే అభియోగాలతో సంతకాలు సేకరించి ఎంపీటీసీ తనపై కుట్ర పూరితంగా ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు.
వీడియో కోసం క్రింద చూడండి
చిలకలూరిపేట - 1319 డోక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ - MLA విడుదల రజిని
చిలకలూరిపేట:- 1319 డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విడదల రజినితో పాటుగా వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. 11 సెప్టెంబర్ 2020 న మొదటి విడతగా చెక్కులు పంపిణీ చేయగా రెండో విడతగా శుక్రవారం నాడు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1319 సంఘాలకు 10 కోట్ల 86 వేల 788 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో ప్రజల కష్టాలను చూస ఆర్థికంగా ముందుకు వెళ్లటం కోసం డోక్రా మహిళలకు వైయస్సార్ ఆసరా పథకాన్ని తీసుకువచ్చారని అని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫాని, కమిషనర్ రవీంద్ర, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-2021 బుధవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి.
వాటి వివరాలు.
RTC బస్టాండు సమీపంలో - 2
సుబ్బయ్యతోట లో - 1 గా నమోదు అయ్యాయి.
మహిళలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వం మన ప్రభుత్వం - MLA విడుదల రజిని
చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని గణపవరం గ్రామం సొసైటీ బ్యాంకు ఆవరణలో మంగళవారం డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏకంగా 50 గ్రూపులకు రూ.5 కోట్ల రుణాలు అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణపవరం సొసైటీ బ్యాంకు పరిధిలో గణపవరం, అప్పాపురం, కనపర్తి, ఇర్లపాడు, ఆవిశాయపాలెం గ్రామాలు ఉన్నాయని, ఈ ఐదు గ్రామాల్లో కలిపి మొత్తం 563 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నడిచే జీడీసీసీబీలోనే వీరంతా రుణాలు పొందాలనే గొప్ప సంకల్పంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా రుణాలకు అత్యల్ప వడ్డీ కేవలం 9 శాతం వసూలు చేసేది ఒక్క జీడీసీసీ బ్యాంకు మాత్రమేనని, ఇతర బ్యాంకులు 11, 12 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని వివరించారు. అందుకే డ్వాక్రా గ్రూపులు సొసైటీ బ్యాంకులకు మారడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. గణపవరం గ్రామంలో ఈ విషయంలో విజయం సాధించగలిగామని చెప్పారు. ఈ పరిధిలోని దాదాపు 100 గ్రూపులను ఇప్పటికే ఇతర బ్యాంకుల నుంచి గణపవరం సొసైటీ బ్యాంకుకు మార్చగలిగామని పేర్కొన్నారు. ఇది నిజంగా మానిమేటర్ల కష్టానికి ప్రతిఫలమని చెప్పారు. సొసైటీల్లో డ్వాక్రా గ్రూపులకు ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ మొత్తంలో లోన్లు ఇస్తారని చెప్పారు. మహిళలు ఎంత అడిగితే అంత రుణం మంజూరయ్యేలా తాను జీడీసీసీ బ్యాంకు చైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ
ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారి సారథ్యంలో మహిళలకు వరంలాంటి పాలన అందుతోందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీని చేసి చూపుతున్న ప్రభుత్వం తమదన్నారు. ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ద్వారా తొలి విడత నగదును గతేడాది మహిళామ తల్లులకు అందిందని చెప్పారు. రెండో విడత డబ్బులు కూడా రేపు గురువారం రోజున ఆడపడుచులకు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం డ్వాక్రా రుణాలపై ఏటా వడ్డీ కూడా జమ చేస్తోందని చెప్పారు. ఇప్పటికే రెండేళ్లకు కలిపి రూ.2,200 కోట్లకుపైగా వడ్డీని తమ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందజేసిందన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.. ఇలా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కూడా మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చుతున్నాయని చెప్పారు. రేషన్ కార్డులు సైతం మహిళల పేరుతోనే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇస్తున్న ఇళ్ల స్థలాలు, కడుతున్న ఇళ్లు అన్నీ మహిళల పేర్లతోనే ఉంటున్న విషయం మనందరికీ గర్వకారణమని తెలిపారు.
మా ప్రభుత్వ హయాంలో రూ.20.23 కోట్ల నిధులు
గణపవరం సొసైటీ అధ్యక్షుడు కాట్రు రమేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు సొసైటీ నుంచి రూ.20.23 కోట్లు అందజేసినట్లు తెలిపారు. తమ త్రిసభ్య కమిటీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,కొమరవల్లి పాడు సొసైటీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, కౌన్సిలర్లు తులం సుధాకర్,పిల్లి సాగర్,ఆదం వలి నాయకులు కెల్లంపల్లి సుందరరావు, గాలి బుచ్చయ్య,బొప్పూడి రామారావు,బొంతా ప్రభుదాస్,మలిశెట్టి సుబ్బారావు,మండలనేని వెంకటేశ్వర్లు,ఆముదాలపల్లి అంజి,మరియు పలువురు పాల్గొన్నారు.
రామకృష థియేటర్ సెంటర్, సీతారామయ్య సైకిల్ షాప్
బియ్యం కోట్ల బజార్,పావురాళ్ల మిల్లు ప్రక్కన
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు
చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు
Total Followers
| ధియేటర్ పేరు | సినిమా పేరు |
|---|---|
| సాయి కార్తికా స్క్రీన్ - 1 | |
| సాయి కార్తికా స్క్రీన్ - 2 | |
| భాస్కర్ సినిమాస్ | |
| విజయ భాస్కర్ సినిమాస్ | |
| K R మినీ సినిమాస్ | |
| కృష్ణమహల్ థియేటర్స్ | |
| రామకృష్ణ థియేటర్స్ | |
| వేంకటేశ్వర థియేటర్స్ | |
| శ్రీనివాసా థియేటర్స్ | |
| విజయలక్ష్మి థియేటర్స్ |
| కూరగాయల రకాలు | తూకం | ధరలు |
|---|---|---|
| టమాటా | 1 kg | 30 |
| పచ్చి మిర్చి | 1Kg | 50 |
| వంకాయలు | 1Kg | 40 |
| బెండకాయలు | 1Kg | 40 |
| బంగాళాదుంపలు | 1Kg | 40 |
| దొండకాయలు | 1Kg | 40 |
| మున్నక్కాయలు | 1 Kg | 80 |
| దోసకాయలు | 1Kg | 40 |
| క్యాబేజి | 1Kg | 40 |
| క్యాలీఫ్లవర్ | 1Kg | 50 |
| చిక్కుడుకాయలు | 1Kg | 120 |
| గోరు చీకుళ్ళు | 1Kg | 60 |
| బీన్స్ | 1Kg | 80 |
| క్యారెట్ | 1Kg | 100 |
| బీట్రూట్ | 1Kg | 80 |
| కాకరకాయలు | 1Kg | 60 |
| ఉల్లిపాయలు | 1Kg | 40 |
| చిన్నుల్లిపాయాలు | 1Kg | 100 |
| తోటకూర | 1 కట్ట | 7 |
| పాలకూర, | 1 కట్ట | 7 |
| చుక్కకూర | 1 కట్ట | 7 |
| మెంతుకూర | 1 కట్ట | 7 |
| గోంగూర | 1 కట్ట | 7 |
| కొత్తిమీర | 1 కట్ట | 50 |
| కర్వేపాకు | 1Kg | 40 |
Founder & Managing Director (CEO and MD)
JANAGAM SIVA
Co-Founder & Chief Advisor
MANDADI PHANI
Registered with Ministry of MSME, Govt. of India
Udyam No: UDYAM-AP-22-0063977