|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపైనా కారు ఢీ కొని వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణానికి చెందిన దేవరకొండ రాంబాబు తాతపూడి వైపు నుండి ద్విచక్ర వాహనం పైన పట్టణం వైపు వస్తుండగా వెనుక నుండి TS07GP4448 బ్లాక్ బెంజ్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నది. రాంబాబు బైక్ పైనుండి క్రిందపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి మృతిచెందారు.
చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్
చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్
చిలకలూరిపేట పట్టణంలోని డైక్ మెన్ కాలనీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. గత రెండు రోజులగా ఆ ప్రాంతంలో 12 కేసులు నమోదు అవ్వగా కమిషనర్ కరోనా విస్తరించకుండా కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అలాగే బాధితులను క్వారంటైన్ సెంటర్కు తరలించారు.అలాగే ఆ ప్రాంతం అంతా హైపోక్లోరిక్ సోడియం తో శానిటైజేషన్ చేపించారు. వారం రోజులపాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలియజేసారు.
నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021 శుక్రువారం నాడు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 45 సంవత్సరాలు దాటినా ప్రభుత్వ ఉపాయధ్యాయులకు మొదటిడొసు, రెండవ డోసు,పాలు ఇచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు మాత్రమే వ్యాక్సిన్ వెయ్యనునట్లు నోడల్ డాక్టర్ గోపీనాయక్ తెలిపారు.
యడ్లపాడు పీహెచ్ సీ పరిధిలో - 600
నాదెండ్ల పీహెచ్ సీ పరిధిలో - 500
గణపవరం పీహెచ్ సీ పరిధిలో - 500
కావూరు పీహెచ్ సీ పరిధిలో - 800
పురుషోత్తమపట్నం యుపీహెచ్ సీ పరిధిలో - 200
రజక కాలనీ పీహెచ్ సీ పరిధిలో - 300
సుబ్బయ్యతోట పీహెచ్ సీ పరిధిలో - 200
పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ లో - 500 మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు.
చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం -
చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం -
అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా చట్టల అమలు విషయంలో మీనమేషాలు లెక్కించడం వలన ఆనాటి నుంచి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి సూచన మేరకు భారతీయ జనతా యువమోర్చా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధర్నాలు సంతకాల సేకరణలు వంటి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఇప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన రెడ్డి గారు ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ఆదేశాలు ఇచ్చారు. ఇది భారతీయ జనతా యువమోర్చా విజయంగా భావిస్తూనే ఇప్పటికైనా అగ్రవర్ణ పేదలకు ఆశాజ్యోతిగా మారిన ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా యువమోర్చా నరసరావుపేట పార్లమెంటు శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రతుకు భారంగా భావిస్తున్న అగ్రవర్ణ పేదలకు భరోసానిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ చట్టం చేసి వారి జీవితాల్లో ఆనందం నింపిన మన ప్రధానమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అగ్రవర్ణ పేదల తరఫున ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ , పట్టణ అధ్యక్షులు నందిగామ రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీధర్,ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి వంకాయలపాటి సాయి, ఏబీవీపీ రాష్ట్ర సభ్యులు మురారి, ఏబీవీపీ పట్టణ నాయకులు లీలా కృష్ణ పలువురు పాల్గొన్నారు
చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజవర్గంలో 15-07-2021 గురువారం నాడు మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 5 కేసులు నమోదు అయ్యాయి.
డైక్ మెన్ కాలనీ లో - 3
రజక కాలనీ లో - 1
సుభాని నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి.
గోవిందపురం గ్రామంలో - 3
పసుమర్రు గ్రామంలో - 1
గొట్టిపాడు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండలంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
తిమ్మాపురం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు నమోదు అయిన కరోనా వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 14-07-2021 బుధవారం నాడు మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
పురుషోత్తమపట్నం లో - 1
మారెళ్లవారివీధి లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 10 కేసులు నమోదు అయ్యాయి.
వేలూరు గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 8
బొప్పూడి గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండలంలో 1 కేసు నమోదు అయ్యింది.
యడ్లపాడు గ్రామంలో - 1
నాదెండ్ల మండల గ్రామంలో 4 కేసులు నమోదు అయ్యాయి.
గణపవరం గ్రామంలో - 2
నాదెండ్ల గ్రామంలో - 1
కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి
చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి
చిలకలూరిపేట పట్టణంలో రేపు నియోజకవర్గంలోని మూడు మండలాలలోని గ్రామ & పట్టణంలోని 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి జరుగుతుంది.రైతు బజారు వేదికగా MLA రజిని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మందుకు సంబంధించిన ప్యాకింగ్ ప్రక్రియ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో VR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడీ చేస్తున్నారు.మందుని పొందటానికి సంబందించిన టోకెన్లు ఇప్పటికే వార్డు కౌన్సిలర్లకు అందించారు.
ఆనందయ్య మందు డబ్బాలలో పంపినీ చేస్తున్నారు. ఒక డబ్బా ఆరుగురు వాడవచ్చు. నిల్వ ఉంచటానికి ఫ్రిడ్జ్ లో పెట్టరాదు.ఈ మందు వాడే రోజున ధూమపానం,మద్యం,మాంసాహారం తీసుకోవద్దు.మందు తీసుకున్న కానీ వ్యాక్సిన్ తెప్పనిసరి.గర్భిణీ స్త్రీలు వాడరాదు.ఇతర ఆయుర్వేదం,అల్లోపతి వాడే వారు కూడా ఈ మందు వాడవచ్చు. కచ్చితంగా మందు తీసుకున్న రోజు 5&6 లీటర్ల మంచినీరు త్రాగాలి.కరోనా వచ్చి తగ్గిన వారు కూడా ఈ మందు తీసుకోవచ్చు. చింతపండు గింజ అంత ఉంటుంది ఈ మందు ఉదయం,సాయత్రం భోజనానికి ముందు ఈ మందుని తీసుకోవాలి ఒక్కరోజు మాత్రమే.











