|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట మండలం & యడ్లపాడు మండల గ్రామాలలో 30-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట మండలం & యడ్లపాడు మండల గ్రామాలలో 30-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట మండలం & యడ్లపాడు మండల గ్రామాలలో 30-06-2021,బుధవారం నాడు మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి.
మనుకొండవారిపాలెం గ్రామంలో - 1
మురికిపూడి గ్రామంలో - 1
బొప్పూడి గ్రామంలో - 1
పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయ్యింది.
లింగారావుపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యింది.
చిలకలూరిపేట - MLA రజిని,మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమ్మకై దళితులకు అన్యాయం చేస్తున్నారు - నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుభ్రమణ్యం
చిలకలూరిపేట - MLA రజిని,మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమ్మకై దళితులకు అన్యాయం చేస్తున్నారు - నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుభ్రమణ్యం
చిలకలూరిపేట - యడవల్లి దళితులకు కేటాయించిన భూముల విషయంలో నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుభ్రమణ్యం మాట్లాడుతూ గనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, MLA రజిని కుమ్మకై దళితులకు అన్యాయం చేస్తున్నారు అని ఆరోపించారు. అలాగే 1975 లో అప్పటి గవర్నమెంట్ 416 ఎకరాలను దళితులకు కేటాయిస్తే రెండు సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో పుల్లారావు సొసైటీ రద్దు చేసి ఇప్పుడు మళ్లీ రద్దు చెయ్యటం అన్యాయం అని అనటం ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు. అక్కడ భూములలో ఉన్న బ్లాక్ పెరల్ గ్రానైట్ రాయి కోసం ఈ రోజు దళితులకు అన్యాయం చేస్తున్నారు అని. దళితులకు అన్యాయం జరిగితే న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు.
చిలకలూరిపేట - మురికిపూడి మాజీ సర్పంచ్ కొమ్మనబోయిన దేవయ్య మృతి
చిలకలూరిపేట - మురికిపూడి మాజీ సర్పంచ్ కొమ్మనబోయిన దేవయ్య మృతి
చిలకలూరిపేట మండల గ్రామం అయిన మురికిపూడి గ్రామ మాజీ సర్పంచ్ కొమ్మనబోయిన దేవయ్య మంగళవారం రాత్రి మృతి చెందారు. మురికిపూడి గ్రామంలో తనకంటూ ఒక గుర్తింపు తీసుకున్న నాయకుడు మృతి చెందటం పట్ల గ్రామం ప్రజలు సంతాపం తెలిపారు. అలాగే అయన కుటుంబంలో ఉంచిన భౌతికాయాన్ని MLA రజిని, విడదల గోపి నివాళి అర్పించారు. అలాగే కుటుంబసభ్యులను పరామర్శించారు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీ కరోనా కేసులు నమోదు - 30-06-2021,బుధవారం
చిలకలూరిపేట పట్టణంలో నేడు భారీ కరోనా కేసులు నమోదు - 30-06-2021,బుధవారం
చిలకలూరిపేట - దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుంటే మన చిలకలూరిపేటలో మాత్రం ఈ రోజు విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. 30-06-2021, బుధవారం పట్టణంలో నాడు భారీగా కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 17 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.
మదర్ థెరిస్సా కాలనిలో - 2
గాంధీ పేటలో - 1
పండరీపురం 4వ లైన్లో - 4
సాంబశివనగర్ లో - 3
మార్కండేయ నగర్ లో - 4
గుండయ్యతోటలో - 3 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం.
చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం.
చిలకలూరిపేట మునిసిపల్ సమావేశంలో కొంచం సేపు రసాభాసగా మారింది. టీడీపీ , వైస్సార్సీపీ కౌన్సిల్ సభ్యుల మధ్య ప్రోటోకాల్ పాటించటం లేదు అన్న విషయంలో కొంచం సేపు వాదోపవాదం నడిచింది. వెంటనే సభాధ్యక్షులు రఫాని కలుగజేసుకొని సభ్యులు హుందాగా ప్రవర్తించాలి అని సమయాన్ని వృధా చెయ్యవద్దు అని కోరారు. వార్డులలో జరిగే కార్యక్రమాలకి టీడీపీ కౌన్సిలర్లని ఎందుకు పిలవటం లేదు అని ఇది ప్రోటోకాల్ కి విరుద్ధం అని కొత్త కుమారి ప్రశ్నించారు. కౌన్సిలర్లు ఉండగా ఇంచార్జులు ఏమిటి అని కౌన్సిలర్లు గా ప్రజల వద్ద గెలవని వారికీ ఇంచార్జ్ పోస్టు ఏంటి అని ప్రశ్నించారు.సమావేశంలో మాకు అవకాశం ఇవ్వటం లేదు అని గంగా శ్రీనిసరావు అడగగా గత టీడీపీ సమావేశంలో కూడా మీరు అలాగే మాకు అవకాశం ఇవ్వలేదు అని ఛైర్మెన్ రఫాని అనగా దానికి టీడీపీ సభ్యులు గతంలో మేము అలాగే చేసాం అని ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తారా అని సమాధానం ఇచ్చారు. ఇంకా కొనసాగుతుంది.
క్రింద లింక్ పైన క్లిక్ చేసి వార్త పొందండి.
చిలకలూరిపేట - అడ్డరోడ్డు సెంటర్ నందు ఆర్చి నిర్మాణ ప్రతిపాదన నిలిపివేయండి - మునిసిపల్ కౌన్సిల్ నందు టీడీపీ కౌన్సిలర్లు
చిలకలూరిపేట - అడ్డరోడ్డు సెంటర్ నందు ఆర్చి నిర్మాణ ప్రతిపాదన నిలిపివేయండి - మునిసిపల్ కౌన్సిల్ నందు టీడీపీ కౌన్సిలర్లు
చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ హాళ్లు నందు ఈ రోజు అనగా బుధవారం నాడు జరిగిన కౌన్సిల్ సమావేశంలో 45 అంశాలతో కూడిన అజండాతో కౌన్సిల్ పారంభించారు. ఈ సమావేశమలో మునిసిపల్ కౌన్సిల్ అంతా సభ్యులతో నిండిపోయింది. చెర్మన్ రఫాని అధ్యక్షతన మొదలైన సభలో పలు ముఖ్యమైన అంశాల గురించి ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా పురపాలక నిధులు తక్కువగా ఉన్నందు వలన అడ్డ రోడ్డు రోడ్డు సెంటర్ నందు ప్రతిపాదనలో ఉన్న ఆర్చి నిర్మాణాన్ని నిలిపివేయాలి అని టీడీపీ సభ్యులు తెలిపారు. అలాగే సింగల్ టెండర్లను అనుమతించకూడదు అని టీడీపీ సభ్యుడు గంగా శ్రీనివాసరావు తెలిపారు. టెండర్ వెయ్యటానికి ఎవరు రానందున వచ్చిన సింగిల్ టెండర్ ఆమోదిస్తున్నట్లు రఫ్ఫాని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్లకు ఆమోదం తెలిపారు. అలాగే అధికారుల ఆదేశాలతో గణపవరం లోని అర్బన్ హెల్త్ సెంటర్ను నిలిపివేసినట్లు తెలిపారు.మునిసిపల్ షాపుల వేలం గడువు పెంచాలి అని టీడీపీ సభ్యులు కోరారు. ఇంకా కౌన్సిల్ కొనసాగుతుంది.
సమావేశమలోని తరువాత వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
చిలకలూరిపేట - వాదోపవాదాల మధ్య రసాభాసగా కొనసాగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం.
చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి డాక్టరేట్
చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి డాక్టరేట్
చిలకలూరిపేట నియోజవకవర్గ పరిధి యడ్లపాడు మండలం కారుచోల గ్రామానికి చెందిన వ్యక్తికి డాక్టరేట్ లభించింది. కారుచోల గ్రామానికి చెందిన సయ్యద్ జిలాని కి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలం నుండి డాక్టరేట్ లభించింది.పెద్ద పెద్ద మ్యానుఫ్యాచరింగ్ పరిశ్రమలలో ఉత్పత్తులు తయారీ సమయం, ఖర్చు తగ్గించటం పట్ల చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్ వచ్చినట్లు తెలిపారు.











