మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత 

https://chilakaluripetspeednews.blogspot.com/q


చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ  మరో అరుదైన  ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.  ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.  
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు. 

Book of Achievers 


కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే 

మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
  
    జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.

    అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....

 🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
 🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
 🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి               వారికి ఇచ్చే గౌరవం.
 🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.

         ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........

 🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ                            ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
 🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
 🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
 🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
 🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన  I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
 🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
 🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
 🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
 🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
 🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో........... 

అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. 










































Share:

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలో ఈ రోజు 24-06-2021 MLA విడదల రజిని పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పలు సెంటర్లలో MLA ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మోడ్రన్ మాల్ వద్ద భారీ ఎత్తున రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరుపున నిరు పేదలకు   బట్టలు పంచారు. ఎరువుల కొట్ల బజారులో కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వాడ వాడల ఈ రోజు రజిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. వార్డు స్థాయి వ్యక్తుల నుండి పార్టీ సీనియర్ నాయకులు వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. MLA పుట్టిన రోజుతో పట్టణం అంతా పండుగ వాతావరం అలుముకుంది. 
























































Share:

చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు

చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సొలస గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 

నాదెండ్ల మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి 

గణపవరం గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 



































 

Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 9 కేసులు నమోదు అయ్యాయి 

సి ఆర్ కాలనీ లో - 1

సుభాని నగర్ లో - 3

మార్కండేయ నగర్ లో - 2

సాంబశివ నగర్ లో - 1

వెంగళరెడ్డి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి 

చిలకలూరిపేట మండల గ్రామంలో 6 కేసులు నమోదు అయ్యాయి 

బొప్పూడి గ్రామంలో - 1

కట్టుబడివారిపాలెం గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 1

గోవిందపురం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 

























































Share:

చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి

చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - మండలంలోని కావూరి గ్రామంలో బుధవారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ కత్తి తో దాడి చేసేలా దారి తీసింది. వివరాలలోకి వెళ్తే కావూరు గ్రామంలో రామారావు, కందుల రమేష్ అనే వ్యక్తి వద్ద నుండిడబ్బులు తీసుకున్నాడు. చాలా రోజులుగా అడుగుతుండగా డబ్బులు ఇవ్వకపోవటంతో గొడవ ముదిరి ఇద్దరు బహ బాహికి దిగారు. ఇంతలో రమేష్ కత్తితో రామారావు పైనా దాడి చేసాడు. ఈ ఘర్షణలలో రామారావుకి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో రామారావును చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువచ్చారు.  





































Share:

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - 2021-2022 విద్య సంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ కు వచ్చేశాయి. మంగళవారం సాయంత్రం సమయంలో పాఠ్యపుస్తకాలు తీసుకొని APSRTC కార్గో వాహనం RVSCVS హైస్కూల్ కి చేరాయి. ఇక్కడ నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపినీ చేయనునంట్లు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ( MEO ) ఎల్. లక్ష్మి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 నుండి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ నాకు చేరుకున్నాయి. ఇక్కడ నుండి త్వరలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు రెండు సంవత్సరాలు చదువుకి దూరం అయ్యారు. ఈ సంవత్సరం అయిన కరోనా తగ్గి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉండాలి అని కోరుకుందాం. 

https://chilakaluripetspeednews.blogspot.com/





































Share:

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి...  -  ఇద్దరు నిందితులు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ నాదెండ్ల గ్రామా శివారులలోని NSP కాలువ నందు మే నెల 8 వ తారీఖున గుర్తు తెలియని పెట్రోల్ తో తగలబడిన మృతిదేహానికి సంబంధించిన మిస్టరీని ఛేదించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే పని పట్ట లేక ఆకతాయిగా తీరుతూ ఉండే నాదెండ్ల లోని పెదమాల పల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తి తో పటు బాల సంతోష్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడికట్టారు. 

 నాదెండ్ల గ్రామంలో గ్రానెట్ వ్యాపారం చేసే నారాయణ అనే వ్యక్తి ని వీరిరువురు కలసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణ చేతికి వున్న రెండు ఉంగరాలు, అంతని స్కూటీ ని దొంగిలించాలి అని పధకం వేశారు. అశోక్ పైన చిలకలూరిపేట, అద్దంకి పరిసర గ్రామాలలో దొంగతనం చేసినట్లుగా 15 కేసులు దాకా ఉన్నాయి. అలాగే ఏ మధ్య కాలంలో ఆక్సిడెంట్ జరిగి దొంగతంలో యాక్టీవ్ గా పాల్గొనలేకపోతున్నాడు. అయితే నారాయణ వేలి ఉంగరాలు అమ్ముకొని కాలం గడపవచ్చు అనుకున్నాడు. రోజులాగే బహిర్భుమికి వెళ్లే నారాయణను సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మాటు వేసి ఉంగరాలతో పాటు 8000 నగదు దొంగిలించారు. విషయం బయటపడుతుంది అని బయపడి అంతని మర్మగాల పైనా  ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం వలన నారాయణ అక్కడికి అక్కడే చనిపోయాడు. వెంటనే పెట్రోల్ తీసుకువచ్చి అతని పైన పోసి తగలబెట్టారు.

కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసారు.వారి వద్ద నుండి రెండు ఉంగరాలు,ఒక స్కూటీ రికవరీ చేసారు. కేసుని ఛేదించిన SI సతీష్ ను, ASI రవి చంద్ర ను, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, దేవరాజు, కానిస్టేబుల్ శివప్రసాదు, హోంగార్డ్ మధు బాబులను CI సుబ్బారావు గారు అభినందించారు.   

































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి