|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.
CHILAKALURI PET SPEED NEWSThursday, June 24, 2021గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.
చిలకలూరిపేట - పట్టణంలో ఈ రోజు 24-06-2021 MLA విడదల రజిని పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పలు సెంటర్లలో MLA ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మోడ్రన్ మాల్ వద్ద భారీ ఎత్తున రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరుపున నిరు పేదలకు బట్టలు పంచారు. ఎరువుల కొట్ల బజారులో కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వాడ వాడల ఈ రోజు రజిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. వార్డు స్థాయి వ్యక్తుల నుండి పార్టీ సీనియర్ నాయకులు వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. MLA పుట్టిన రోజుతో పట్టణం అంతా పండుగ వాతావరం అలుముకుంది.
చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు
చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు
చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి.
సొలస గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
నాదెండ్ల మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి
గణపవరం గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 9 కేసులు నమోదు అయ్యాయి
సి ఆర్ కాలనీ లో - 1
సుభాని నగర్ లో - 3
మార్కండేయ నగర్ లో - 2
సాంబశివ నగర్ లో - 1
వెంగళరెడ్డి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామంలో 6 కేసులు నమోదు అయ్యాయి
బొప్పూడి గ్రామంలో - 1
కట్టుబడివారిపాలెం గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 1
మురికిపూడి గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి
చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి
చిలకలూరిపేట - మండలంలోని కావూరి గ్రామంలో బుధవారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ కత్తి తో దాడి చేసేలా దారి తీసింది. వివరాలలోకి వెళ్తే కావూరు గ్రామంలో రామారావు, కందుల రమేష్ అనే వ్యక్తి వద్ద నుండిడబ్బులు తీసుకున్నాడు. చాలా రోజులుగా అడుగుతుండగా డబ్బులు ఇవ్వకపోవటంతో గొడవ ముదిరి ఇద్దరు బహ బాహికి దిగారు. ఇంతలో రమేష్ కత్తితో రామారావు పైనా దాడి చేసాడు. ఈ ఘర్షణలలో రామారావుకి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో రామారావును చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువచ్చారు.
చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు
చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు
చిలకలూరిపేట - 2021-2022 విద్య సంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ కు వచ్చేశాయి. మంగళవారం సాయంత్రం సమయంలో పాఠ్యపుస్తకాలు తీసుకొని APSRTC కార్గో వాహనం RVSCVS హైస్కూల్ కి చేరాయి. ఇక్కడ నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపినీ చేయనునంట్లు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ( MEO ) ఎల్. లక్ష్మి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 నుండి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ నాకు చేరుకున్నాయి. ఇక్కడ నుండి త్వరలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు రెండు సంవత్సరాలు చదువుకి దూరం అయ్యారు. ఈ సంవత్సరం అయిన కరోనా తగ్గి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉండాలి అని కోరుకుందాం.
చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్
చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్
చిలకలూరిపేట నియోజకవర్గ నాదెండ్ల గ్రామా శివారులలోని NSP కాలువ నందు మే నెల 8 వ తారీఖున గుర్తు తెలియని పెట్రోల్ తో తగలబడిన మృతిదేహానికి సంబంధించిన మిస్టరీని ఛేదించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే పని పట్ట లేక ఆకతాయిగా తీరుతూ ఉండే నాదెండ్ల లోని పెదమాల పల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తి తో పటు బాల సంతోష్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడికట్టారు.
నాదెండ్ల గ్రామంలో గ్రానెట్ వ్యాపారం చేసే నారాయణ అనే వ్యక్తి ని వీరిరువురు కలసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణ చేతికి వున్న రెండు ఉంగరాలు, అంతని స్కూటీ ని దొంగిలించాలి అని పధకం వేశారు. అశోక్ పైన చిలకలూరిపేట, అద్దంకి పరిసర గ్రామాలలో దొంగతనం చేసినట్లుగా 15 కేసులు దాకా ఉన్నాయి. అలాగే ఏ మధ్య కాలంలో ఆక్సిడెంట్ జరిగి దొంగతంలో యాక్టీవ్ గా పాల్గొనలేకపోతున్నాడు. అయితే నారాయణ వేలి ఉంగరాలు అమ్ముకొని కాలం గడపవచ్చు అనుకున్నాడు. రోజులాగే బహిర్భుమికి వెళ్లే నారాయణను సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మాటు వేసి ఉంగరాలతో పాటు 8000 నగదు దొంగిలించారు. విషయం బయటపడుతుంది అని బయపడి అంతని మర్మగాల పైనా ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం వలన నారాయణ అక్కడికి అక్కడే చనిపోయాడు. వెంటనే పెట్రోల్ తీసుకువచ్చి అతని పైన పోసి తగలబెట్టారు.
కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసారు.వారి వద్ద నుండి రెండు ఉంగరాలు,ఒక స్కూటీ రికవరీ చేసారు. కేసుని ఛేదించిన SI సతీష్ ను, ASI రవి చంద్ర ను, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, దేవరాజు, కానిస్టేబుల్ శివప్రసాదు, హోంగార్డ్ మధు బాబులను CI సుబ్బారావు గారు అభినందించారు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి.
తూబాడు గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 8
కనపర్రు గ్రామంలో - 1
ఇర్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి.
ఉన్నవ గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.












