|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట నియోజకవర్గంలో బ్లాక్ ఫంగస్ తో రైతు మృతి
చిలకలూరిపేట నియోజకవర్గంలో బ్లాక్ ఫంగస్ తో రైతు మృతి
చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో బ్లాక్ ఫంగస్ తో అన్నదాత మృతి చెందారు. దీనితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ గ్రామంలో బ్లాక్ ఫంగస్ వాళ్ళ చనిపోవటం బాధకరం అని గ్రామ పెద్దలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే సాతులూరు గ్రామానికి చెందిన రైతు (68) గత కొన్ని రోజుల క్రితం కరోనా బారి నుండి కోలుకున్నాడు. మళ్లీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చేరి వైద్య పరిక్షలు చెయ్యగా అతనికి బ్లాక్ ఫంగస్ గా గుర్తించారు. వెంటనే GGH కి తరలించి చికిత్స అందిస్తుండగా పక్షవాతం వచ్చి శరీరంలోని అవయవాలు పని చెయ్యక, వైద్యానికి సహకరించక ఆరోగ్యం క్షిణించి మృతి చెందారు.
చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ నందు వ్యాక్సిన్ - ప్రజలు అపోహలు మాని వ్యాక్సిన్ తీసుకోండి ప్రాణాలను కాపాడుకోండి - డాక్టర్ రవి తేజా నాయక్
చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ నందు వ్యాక్సిన్ - ప్రజలు అపోహలు మాని వ్యాక్సిన్ తీసుకోండి ప్రాణాలను కాపాడుకోండి - డాక్టర్ రవి తేజా నాయక్
చిలకలూరిపేట పట్టణంలోని RVSCVS హైస్కూల్ నందు శనివారం నాడు 100 డోసులు వ్యాక్సినేషన్ నిర్వహించారు. పట్టణంలోని RVSCVS హైస్కూల్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలి అని డిస్పెన్సరీ డాక్టర్ రవి తేజా నాయక్ తెలిపారు. ప్రజలు అపోహలు మానేసి కరోనా నుండి బయపడటానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని, రెండవ డోసు తీసుకోవలసిన వారు 84 రోజుల తరవాత వచ్చి ఇక్కడే వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంధి, ANM లు, MNO లు పాల్గొన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం - ఇరువురు అరెస్ట్
చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం - ఇరువురు అరెస్ట్
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు మండలం కొత్త సొలస గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వచేసి ఉన్నది అని ఇద్దరిని అరెస్ట్ చేసిన SI రాంబాబు. మేడిద మోహన్ రావు, తిరుమలశెట్టి కోటేశ్వరరావు అని ఇద్దరి వ్యక్తుల నుండి 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వారి పైన కేసులు నమోదు చేసారు. మండలంలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.
చిలకలూరిపేట మండల గ్రామాలో - నిషేదిత గుట్కా,ఖైనీ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
చిలకలూరిపేట మండల గ్రామాలో - నిషేదిత గుట్కా,ఖైనీ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
చిలకలూరిపేట పసుమర్రు గ్రామంలో నిషేదిత గుట్కా,ఖైనీ అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు.చిలకలూరిపేట రురల్ SI భాస్కర్ కి వచ్చిన సమాచారంతో గ్రామంలో తనిఖీ చెయ్యగా గ్రామా శివారులలో అక్రమంగా అమ్ముతూ పట్టుబడ్డాడు. గ్రామంలో వచ్చిన సమాచారం మేరకు ఈ షేక్ బాషా అనే వ్యక్తి చాలా కాలంగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు 8500 వరకు ఉంటుంది అని తెలిపారు.ఇలాంటి నిషేదిత గుట్కా అమ్మీనా , కొనిన వారి పైన కూడా కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.
చిలకలూరిపేటలో అక్రమ మద్యం గుట్టు రట్టు - ఇద్దరు అరెస్ట్
చిలకలూరిపేటలో అక్రమ మద్యం గుట్టు రట్టు - ఇద్దరు అరెస్ట్
చిలకలూరిపేట పట్టణంలో ఇతర రాష్ట్రాల మద్యం అమ్ముతున్న వ్యక్తులను అరెస్ట్ చేసారు. అర్బన్ సీఐ బిలాలుద్దీన్ కి వచ్చిన సమాచారం మేరకు SI అజయ్ బాబు నిర్వహించిన దాడిలో రామకృష్ణ, పవన్ సాయి అనే వ్యక్తుల నుండి 70 వేలరూపాయల విలువ గల తెలంగాణకు చెందిన మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నారు. అందులో 35 ఫుల్ బాటిల్స్, 141 క్వాటర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల,లోకల్ మద్యం అయినా అక్రమంగా అమ్ముతూ పట్టుబడితే వారిపైన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 12-06-2021, శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
యడ్లపాడు మండలంలో 2 కరోనా కేసులు నమోదు అయ్యాయి
తిమ్మాపురం గ్రామంలో - 2
నాదెండ్ల మండలంలో 19 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
నాదెండ్ల గ్రామంలో - 2
చంద్రవరం గ్రామంలో - 1
ఇర్లపాడు గ్రామంలో - 1
కనపర్రు గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 6
సాతులూరు గ్రామంలో - 7 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 12-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 12-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 12-06-2021,శనివారం నాడు మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
పండరీపురం లో - 3 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి వాటా వివరాలు
కట్టుబడివారిపాలెం గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 1
లింగంగుంట్ల గ్రామంలో - 1
పసుమర్రు గ్రామంలో - 4
వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి











