మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

ఒకపక్క ఫ్రీగా ఇస్తూ మరో పక్క వీర బాదుడు బాదుతున్న కేంద్రం

ఒకపక్క ఫ్రీగా ఇస్తూ మరో పక్క వీర బాదుడు బాదుతున్న కేంద్రం 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కబళిస్తున్న సమయంలో ఫ్రీ వ్యాక్సిన్ ఓకేంత ఊరటనిచ్చినా , సామాన్యుల నడ్డి మాత్రం  విరక్కొట్టటం తప్పేలా లేదు. లీటర్ 75 రూపాయలు ఉండే పెట్రోల్ ధర ఈ రోజు 102 రూపాయలు అంటే సుమారు 27 రూపాయల బాదుడు. అంటే వారానికి సుమారు 4 సార్లు పెట్రోల్ కొట్టించినా సుమారు 100 రూపాయలు ప్రతి సామాన్యుడి నుండి వసూళ్లు చేస్తున్నట్లు. ఈ బాదుడు కన్నా వ్యాక్సిన్ ధర డైరెక్ట్ గా మార్కెట్లోకి వదిలినా 1000 రూపాయలు  అనుకుందాం. ఆ లెక్కన సామాన్యుడి జేబు చిల్లు పడుతున్న విషయం అర్ధం కావటం లేదు. ఫ్రీ సోర్స్ కి అలవాటుపడ్డ ప్రజలు వెనక జరుగుతున్నా పరిణామాల గురించి ఆలోచించటం లేదు. 

ప్రైవేట్ హాస్పిటళ్ళకు 25% వ్యాక్సిన్ ఇవ్వాలి అని మోడీ గారి నిర్ణయించుకున్నారు. ఇక్కడే ఉంది అసలు కధ చచ్చిన వారిపైన డబ్బులు ఏరుకునే ప్రైవేట్ వైద్యశాలల చేతిలో వ్యాక్సిన్ పెడితే బ్లాక్ మార్కెట్ దందా మాములుగా కొనసాగదు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రెమిడీసీవర్ అనే ఇంజక్షన్ 2000 ఉంటే వాటి అన్నిటిని హోల్డ్ చేసి బ్లాక్ మార్కెట్ లో 40000( నలబై వేలు ) కు అమ్ముకున్న దాఖలాలు కోకొల్లలు.  అలాగే మంచి బ్రాండెడ్ వ్యాక్సీలకు రెక్కలొచ్చే టైం త్వరలోనే ఉంది. 
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే కేవలం ఆయిల్ రేట్లు పెరిగినట్లు కాదు. ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి , నిత్యావసరాల సరుకుల రవాణా పెరిగిపోయాయి, నిత్యావసరాల సరుకులకు రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగురుతాయి. అప్పుడు సామాన్యుడు ఆకులూ అలమలు తిని బ్రతకాలి. 


































Share:

గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా

గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణములో భారీగా దొరికిన గుట్కా నిల్వలు- వివరాలలోకి వెళ్తే ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం గ్రామము నందు నిషేదిత గుట్కా అమ్మే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం చిలకలూరిపేట నుండి ఈ గుట్కా, పాన్ పరాగ్ సప్లై వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. అయితే సదరు పోలీస్ అధికారులు నిఘా వేసి పట్టణంలోని గౌడ కళ్యాణ మండపం దగ్గిరలోని 3 గోడోన్లలలో  గుట్కా నిల్వల పైన ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అక్కడ దొరికిన గుట్కా నిల్వలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. భారీగా నిల్వ ఉంచిన 3 గోడోన్లను తనిఖీ చేసి అందులోని గుట్కా నిల్వలను రెండు లారీలలో వేటపాలెం తరలించారు. పట్టుబడ్డ సరుకు విలువ సుమారు 60 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉండవచ్చు అని అంచనా. వేటపాలెం CI రోశయ్య, SI కమలాకర్ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 


https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/


























Share:

చిలకలూరిపేట పట్టణ వాసులకు విజ్ఞప్తి - ఆస్తి పన్ను చెలింపు పైన రాయితీ - ఈ నెల చివరి వారికే ఈ అవకాశం

చిలకలూరిపేట పట్టణ వాసులకు విజ్ఞప్తి - ఆస్తి పన్ను చెలింపు పైన రాయితీ - ఈ నెల చివరి వారికే ఈ అవకాశం  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టాన వాసులకు 2021-2022 సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరానికి సంబంధించి ఆస్థి పన్ను చెలింపు పైన ఈ నెల చివరి వరకు వడ్డీ లేకుండా రాయితీ ఇస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. పన్ను కట్టవలసినవారు ఆన్లైన్ ద్వారా కానీ మునిసిపాలిటీ కార్యాలయంలో, వార్డు సచివాలయాలలో ద్వారా కానీ చెల్లించవచ్చు. ఈ నెల చివరికల్లా కట్టకపోయిన జులై నెల నుండి 2% వడ్డీ తో కట్టవలసి వస్తుంది అని తెలిపారు.  




































 
Share:

చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 17  కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేసుల వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

తూర్పుమాలపల్లి లో - 1

గాంధీపేట లో - 1

 పండరీపురంలో - 1

సాంబశివనాగర్ లో -1 గా నమోదు అయ్యాయి. 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

గోవిందపురం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

మిట్టపాలెం గ్రామంలో  -  1

బొప్పూడి గ్రామంలో  - 1

యడవల్లి గ్రామంలో - 1

కావూరు గ్రామంలో - 5

మద్దిరాల గ్రామంలో - 3 గా నమోదు అయ్యాయి. 
















Share:

చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం

 చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - జూన్ 10 వ తారీకున సినీనటుడు, హిందుపూర్ MLA అయిన నందమూరి బాలకృష్ణ 61వ పుట్టిన రోజు సందర్భంగా చిలకలూరిపేట మండల గ్రామాలూ అయిన కావూరు, లింగంగుంట్ల గ్రామంలోని బాలకృష్ణ ఫాన్స్ తరుపున మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తునట్లు తెలిపారు.  

కరోనా వలన రక్తం ఇచ్చే వారు లేక  బ్లడ్ బ్యాంకు నందు రక్తం నిల్వలు తగ్గిపోయిన కారణంగా అత్యవసర సమయాలలో ఉపయోగపడే ఈ రక్తం కోసం ఈ రక్తదాన శిబిరం నిర్వహించాలి అని నిర్ణయించుకున్నాం అని సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అభిమానులు కరోనా నియమాలు పాటిస్తూ ఈ మహా రక్తదానంలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.

వేదిక :- లింగంగుంట్ల, కావూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద

గమనిక :- కరోనా నియమాలు పాటిస్తూ, మాస్క్,శానిటైజేర్  వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించవల్సిందిగా కోరుతున్నాము. 


























Share:

చిలకలూరిపేట - లాడ్జి లోని అస్థిపంజరం యెక్క ఫోరెన్సిక్ నివేదిక కోసం క్లూస్ టీం

చిలకలూరిపేట - లాడ్జి లోని అస్థిపంజరం యెక్క ఫోరెన్సిక్ నివేదిక కోసం క్లూస్ టీం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - గత వారంలో ఎన్ఆర్టి సెంటర్లోని శ్రీనివాస లాడ్జి నందు బయటపడిన అస్థిపంజరం యొక్క వివరాల కోసం ఫోరెన్సిక్ నివేదిక రెడీ చెయ్యటానికి క్లూస్ టీం మరియు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ టీం ఘటన స్థలానికి చేరుకున్నారు. దీని వలన అస్థిపంజరం ఎవరిది, హత్య లేదా ఆత్మ హత్య, ఎన్ని రోజుల క్రితం జరిగింది అనే విషయాలు కొంతవరకు తెలుసుకొని కేసుని దర్యాప్తు చెయ్యటానికి సులభం అవుతుంది. ఇప్పటికే వారు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. SI అజయ్ బాబు మరియు పోలీస్ సిబ్బంది వారికీ సహకరిస్తూన్నారు  



























Share:

దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం

దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా వ్యాక్సిన్ అంటే ఆమడ దూరం పారిపోయే గ్రామా ప్రజలకు ఈ వార్త నిజంగా ఇన్సిప్రెషన్ అవ్వాలి. మన దేశంలోని జమ్మూకాశ్మిర్లో ఒక చిన్న గ్రామం బందిపూర్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయిన్ గ్రామం. ఆ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి అయినది. ప్రతి రోజు వైద్య సిబ్బంది 18 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి అందరి వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి చేసారు. అలా దేశంలోనే తొలిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న ఊరుగా  వేయిన్ గ్రామం నిలిచింది 






















Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి