|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 09-06-2021,బుధవారం నాడు మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 3 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
భావనారుషి నగర్ లో - 1
ఆర్టీసీ కాలనీ లో - 1
పద్మసాలిపేట లో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
మిట్టపల్లి గ్రామంలో - 1
పసుమర్రు గ్రామంలో - 2
బొప్పూడి గ్రామంలో - 2
యడవల్లి గ్రామంలో - 4
వేలూరు గ్రామంలో - 5
పోతవరం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి
ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం
CHILAKALURI PET SPEED NEWSWednesday, June 09, 2021ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్
No comments
ఏపీలో జులై నెల నుండి సహజ మరణం 1లక్ష, ప్రమాదశాత్తు మరణిస్తే 5 లక్షలు పధకం అమలు - సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీలో వైయస్ జగన్ వైయస్సార్ బీమా పధకంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కుంటుంబంలోని వ్యక్తి ( 18 నుండి 50 వయసు లోపు ) సహజంగా మరణిస్తే 1 లక్ష రూపాయలు, అలాగే 18 నుండి 70 వయసు లోపు వారు ప్రమాదం వలన చనిపోతే 5 లక్షలు అందించాలి అని తెలిపారు. అలాగే దరఖాస్తు చేసుకున్న కుంటుంబానికి నెలలోగా పరిహారం అందించాలి అని తెలిపారు. జులై 1 వ తరుకు నుండి ఈ వైయస్సార్ బీమా పధకానికి మార్పు చేసి అమలు చెయ్యాలి అని సూచించారు.
"జగనన్న తోడు" మీకు రాలేదా అయితే ఇలా చెయ్యండి - వీరు ,మాత్రమే అర్హులు
"జగనన్న తోడు" మీకు రాలేదా అయితే ఇలా చెయ్యండి - వీరు ,మాత్రమే అర్హులు
జగనన్న తోడు అనే పధకం క్రింద ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు,చేతి వృత్తి కళాకారులకు 10 వేలరూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు వారి ఖాతా లో ప్రభుత్వం జమచేస్తుంది. ఈ పథకానికి అర్హులు అయి ఉండి పేర్లు నమోదు చేసుకొని వారు గ్రామ,వార్డు వాలంటీర్లను సంప్రదించండి. వారి ద్వారా సచివాలయాలలో దరఖాస్తు చేసుకోండి. 3 నెలలో పరిశీలించి రుణాలు అందిస్తారు. మరిన్ని వివరాలకు 08912890525, 1902 కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.
జగనన్న తోడు పధకానికి వీరు మాత్రమే అర్హులు
* చేనేత, ఇత్తడి పని చేసేవారు.
* కొండపల్లి బొమ్మలు తయారు చేసే వారు, కలంకారీ , తోలుబొమ్మలు, కుమ్మరి , బొబ్బిలి వీణ, ఏటి కొప్పాక , ఇతర చేతి వృత్తుల వారు
* తోపుడు బండ్ల పైన కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్ధాలు అమ్మేవారు
* గంపలలో, బుట్టలలో వస్తువులు అమ్మే వారు,
* సైకిళ్ళు, ఆటోలలో , బైకుల పై వ్యాపారం చేసుకునే వారు
* 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత, తాత్కలిక షాపులు ఉండేవారు
అర్హులు
ఒకపక్క ఫ్రీగా ఇస్తూ మరో పక్క వీర బాదుడు బాదుతున్న కేంద్రం
ఒకపక్క ఫ్రీగా ఇస్తూ మరో పక్క వీర బాదుడు బాదుతున్న కేంద్రం
కరోనా కబళిస్తున్న సమయంలో ఫ్రీ వ్యాక్సిన్ ఓకేంత ఊరటనిచ్చినా , సామాన్యుల నడ్డి మాత్రం విరక్కొట్టటం తప్పేలా లేదు. లీటర్ 75 రూపాయలు ఉండే పెట్రోల్ ధర ఈ రోజు 102 రూపాయలు అంటే సుమారు 27 రూపాయల బాదుడు. అంటే వారానికి సుమారు 4 సార్లు పెట్రోల్ కొట్టించినా సుమారు 100 రూపాయలు ప్రతి సామాన్యుడి నుండి వసూళ్లు చేస్తున్నట్లు. ఈ బాదుడు కన్నా వ్యాక్సిన్ ధర డైరెక్ట్ గా మార్కెట్లోకి వదిలినా 1000 రూపాయలు అనుకుందాం. ఆ లెక్కన సామాన్యుడి జేబు చిల్లు పడుతున్న విషయం అర్ధం కావటం లేదు. ఫ్రీ సోర్స్ కి అలవాటుపడ్డ ప్రజలు వెనక జరుగుతున్నా పరిణామాల గురించి ఆలోచించటం లేదు.
ప్రైవేట్ హాస్పిటళ్ళకు 25% వ్యాక్సిన్ ఇవ్వాలి అని మోడీ గారి నిర్ణయించుకున్నారు. ఇక్కడే ఉంది అసలు కధ చచ్చిన వారిపైన డబ్బులు ఏరుకునే ప్రైవేట్ వైద్యశాలల చేతిలో వ్యాక్సిన్ పెడితే బ్లాక్ మార్కెట్ దందా మాములుగా కొనసాగదు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రెమిడీసీవర్ అనే ఇంజక్షన్ 2000 ఉంటే వాటి అన్నిటిని హోల్డ్ చేసి బ్లాక్ మార్కెట్ లో 40000( నలబై వేలు ) కు అమ్ముకున్న దాఖలాలు కోకొల్లలు. అలాగే మంచి బ్రాండెడ్ వ్యాక్సీలకు రెక్కలొచ్చే టైం త్వరలోనే ఉంది.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే కేవలం ఆయిల్ రేట్లు పెరిగినట్లు కాదు. ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయి , నిత్యావసరాల సరుకుల రవాణా పెరిగిపోయాయి, నిత్యావసరాల సరుకులకు రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగురుతాయి. అప్పుడు సామాన్యుడు ఆకులూ అలమలు తిని బ్రతకాలి.
గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా
గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారిన చిలకలూరిపేట - భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం - 60 లక్షల నుండి కోటి రూపాయ సరుకు ఉండవచ్చు అని అంచనా
చిలకలూరిపేట పట్టణములో భారీగా దొరికిన గుట్కా నిల్వలు- వివరాలలోకి వెళ్తే ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం గ్రామము నందు నిషేదిత గుట్కా అమ్మే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం చిలకలూరిపేట నుండి ఈ గుట్కా, పాన్ పరాగ్ సప్లై వస్తున్నట్లు సమాచారం తెలుసుకున్నారు. అయితే సదరు పోలీస్ అధికారులు నిఘా వేసి పట్టణంలోని గౌడ కళ్యాణ మండపం దగ్గిరలోని 3 గోడోన్లలలో గుట్కా నిల్వల పైన ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అక్కడ దొరికిన గుట్కా నిల్వలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. భారీగా నిల్వ ఉంచిన 3 గోడోన్లను తనిఖీ చేసి అందులోని గుట్కా నిల్వలను రెండు లారీలలో వేటపాలెం తరలించారు. పట్టుబడ్డ సరుకు విలువ సుమారు 60 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఉండవచ్చు అని అంచనా. వేటపాలెం CI రోశయ్య, SI కమలాకర్ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
చిలకలూరిపేట పట్టణ వాసులకు విజ్ఞప్తి - ఆస్తి పన్ను చెలింపు పైన రాయితీ - ఈ నెల చివరి వారికే ఈ అవకాశం
చిలకలూరిపేట పట్టణ వాసులకు విజ్ఞప్తి - ఆస్తి పన్ను చెలింపు పైన రాయితీ - ఈ నెల చివరి వారికే ఈ అవకాశం
చిలకలూరిపేట పట్టాన వాసులకు 2021-2022 సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరానికి సంబంధించి ఆస్థి పన్ను చెలింపు పైన ఈ నెల చివరి వరకు వడ్డీ లేకుండా రాయితీ ఇస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. పన్ను కట్టవలసినవారు ఆన్లైన్ ద్వారా కానీ మునిసిపాలిటీ కార్యాలయంలో, వార్డు సచివాలయాలలో ద్వారా కానీ చెల్లించవచ్చు. ఈ నెల చివరికల్లా కట్టకపోయిన జులై నెల నుండి 2% వడ్డీ తో కట్టవలసి వస్తుంది అని తెలిపారు.
చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
CHILAKALURI PET SPEED NEWSTuesday, June 08, 2021కరోనా న్యూస్, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట 08-06-2021, మంగళవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 17 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
తూర్పుమాలపల్లి లో - 1
గాంధీపేట లో - 1
పండరీపురంలో - 1
సాంబశివనాగర్ లో -1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
గోవిందపురం గ్రామంలో - 1
మురికిపూడి గ్రామంలో - 1
మిట్టపాలెం గ్రామంలో - 1
బొప్పూడి గ్రామంలో - 1
యడవల్లి గ్రామంలో - 1
కావూరు గ్రామంలో - 5
మద్దిరాల గ్రామంలో - 3 గా నమోదు అయ్యాయి.













