|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిసోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య
సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య
చాల రోజుల నుండి ఎదురు చూస్తున్న ఆనందయ్య మందు పంపిణి పైన క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఎర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆనందయ్య మాట్లాడుతూ ప్రజలు మందు కోసం వేచి చూస్తున్నారు అని అందువలన సోమవారం నుండి మందు పంపిణి జరుగుతుంది అని తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య సోదరుడు, శిష్యబృందం మందుని అందజేస్తారు అని. క్యూ లైన్ లో ఉన్న వారికి త్వరగా మందు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని ప్రాంతాల వారికీ త్వరలో మందు పంపిణి చేస్తాం అని తెలిపారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి
ఆంధ్రప్రదేశ్ - గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి ముఖ్యమంత్రి మరియు కేంద్ర హోమ్ శాఖా మంత్రిగా చేసిన కాసు బ్రహ్మనందరెడ్డి సతీమణి అయిన కాసు రాఘవమ్మ (96) గారు ఆదివారం హైద్రాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె స్వస్థలం చిలకలూరిపేట నియోజవర్గం అయిన నాదెండ్ల మండలం. ఆమె మరణ వార్త తెలుసుకున్న మండల ప్రజలు ఆమెకు సంతాపం తెలిపారు. అలాగే రాజకీయ నాయకులూ, ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు
గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది - అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు
గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది - అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు
కంచె చేనుని మేసినట్లు - గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం కట్టడి చెయ్యాల్సిన పోలీస్ వారే ప్రోత్సహించారు. జిల్లాలోని పలనాడు ప్రాంతం మపాళ్ళ, దుర్గి SI లు ఈ ఘటనకు పాల్పడారు. ముప్పాళ్ల SI నాగేశ్వరరావు , దుర్గి SI రామాంజనేయులు పైనా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో ఇరువురు SI లు ఇతర రాష్ట్రాల నుండి మద్యం తీసుకువచ్చి అమ్మే వారి దగ్గిర నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు నిర్ధారణ అయినది. వెంటనే పోలీసు ఉన్నత అధికారులు ఇరువురి SI ల పైన వేటు వేశారు
చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు
చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు
చిలకలూరిపేట పట్టణంలోని 23వ వార్డు లోని ప్రజలు మునిసిపాలిటీ వాటర్ రాకపోవటంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వార్డులోని ప్రజలు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి వార్డులో మంచినీటి సమస్య ఉన్నది అని, ప్రతి రోజు రాత్రి సమయాలలో నిద్రలేకుండా మంచినీటి కోసం మోటర్లు వేస్తు తెల్లవారు జామున వేచి ఉన్నకాని మునిసిపాలిటీ వాటర్ రావటం లేదుఅని, పొద్దుపొద్దున్నే లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు కూడా మంచినీరు నిత్యావసరం అని,వార్డు ప్రజలువారి బాధను వ్యక్తం చేసారు. 23వ వార్డు లోని గౌడ పాలెం , సత్రం బజార్, దర్గ బజార్, మామిడోళ్ల బజార్లోని ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. స్థానికి వార్డు కౌన్సిలర్ కంచర్ల కరుణ గారు అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకులతో మంచి నీటిని అందించారు. గతంలో 10 రోజుల క్రితం కూడా వార్డు ఇంచార్జి శ్రీరాం శివ పార్వతి గారు కూడా ఇలాగే వాటర్ ట్యాంకులని తెపించి మంచి నీటిని అందించారు. అయితే వార్డు ప్రజలు మాత్రం వాటర్ ట్యాంకులతో కాకుండా మంచినీటిని పైపుల ద్వారా అందించటానికి, వాటి సంబందించిన అధికారులతో మాట్లాడి మరమ్మతులు త్వరగా పూర్తి చేయించి నీటి సమస్యని పరిష్కరించాలి అని కోరారు.
చిలకలూరిపేట 05-06-2021 , శనివారం నాడు పట్టణం & మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు
చిలకలూరిపేట 05-06-2021 , శనివారం నాడు పట్టణం & మండల గ్రామాలలో నమోదు అయిన కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 22 కేసులు నమోదు అయ్యాయి. అందులో
చిలకలూరిపేట పట్టణంలో 7 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు
సుబ్బయ్యతోట లో - 1
పురుషోత్తమపట్నం లో - 1
పండరీపురం 9 వ లైన్ నందు - 2
మదర్ థెరిసా కాలనీ నందు - 1
వేలూరు రోడ్డు లో - 1
తూర్పు మలపల్లి లో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు
కట్టుబడివారిపాలెం గ్రామంలో - 1
రామచంద్రపురం గ్రామంలో - 2
మురికిపూడి గ్రామంలో - 1
తాతపూడి గ్రామంలో - 1
పసుమర్రు గ్రామంలో - 2
యడవల్లి గ్రామంలో - 4
బొప్పూడి గ్రామంలో - 2
కావూరు గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో -1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట - లాడ్జి గదిలో అస్థిపంజరం - షాక్ లో లాడ్జి నిర్వాహకుడు
చిలకలూరిపేట - లాడ్జి గదిలో అస్థిపంజరం - షాక్ లో లాడ్జి నిర్వాహకుడు
చిలకలూరిపేట పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నందు శ్రీనివాస లాడ్జి నందు ఆస్థి పంజరం కలకలం సృష్టించింది. లాడ్జి మరమ్మతుల కొరకు నిర్వాహకులు పరిశీలించగా 3వ అంతస్థులో
ఒక గది లోపల లాక్ చేసి ఉండటాన్ని గమనించారు. అయితే సదరు మేస్త్రి తలుపులు పగలోగొట్టగా గది లోపల మరుగుదొడ్డి నందు కూడా లాక్ చేసి ఉంది. దాని తలుపులు కూడా పగలగొట్టగా లోపల అస్థిపంజరం టవల్ తో వేలాడుతూ కనపడి ఉంది. దీనితో షాక్ కి గురి అయిన సదరు నిర్వాహకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అస్థిపంజరానికి T - షర్ట్ ఉండటంతో పురుషుడిగా నిర్ధారించారు. కరోనా లాక్ డౌన్ వలన రూమ్ తక్కువగా వినియోగిస్తున్నాం అని అందువలన గుర్తించలేకపొయ్యాం అని నిర్వాహకులు తెలిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో కరోనా కేసుల వివరాలు 04-06-2021 శుక్రువారం
CHILAKALURI PET SPEED NEWSFriday, June 04, 2021కరోనా న్యూస్, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో కరోనా కేసుల వివరాలు 04-06-2021 శుక్రువారం
చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలు అయిన యడ్లపాడు, నాదెండ్లలో నమోదు అయిన కేసుల వివరాలు.
04-06-2021 శుక్రువారం నాడు యడ్లపాడు మండల గ్రామాలలో 6 , నాదెండ్ల మండల గ్రామాలలో 16 కేసులు నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామంలో
లింగారావు పాలెం గ్రామంలో - 1
బోయపాలెం గ్రామంలో - 1
యడ్లపాడు గ్రామంలో - 1
ఉన్నవ గ్రామంలో - 3 గా నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండలంలోని గ్రామంలో
గిరిజవోలు గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 7
చంద్రవరం గ్రామంలో - 3
నాదెండ్ల గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి.











