|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - పట్టణంలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 04-06-2021 ,శుక్రువారం
చిలకలూరిపేట - పట్టణంలో నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 04-06-2021 ,శుక్రువారం
చిలకలూరిపేట పట్టణంలో ఈ రోజు అనగా 04-06-2021, శుక్రువారం నాడు నమోదు అయిన కేసుల వివరాలు
పట్టణంలో ఈ రోజు చాల తక్కువగా 4 కేసులు నమోదు అయ్యాయి.
సుబ్బయ్యతోట - 1
పండరీపురం - 1
గుర్రాలచావిడీ - 2 కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట అసిస్ట్ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎర్పాటు చేసిన వ్యాక్సిన్ ప్రచార రధాన్ని ప్రారంభించిన జిల్లా SP విశాల్ గున్ని
చిలకలూరిపేట అసిస్ట్ స్వచ్చంధ సంస్థ ద్వారా ఎర్పాటు చేసిన వ్యాక్సిన్ ప్రచార రధాన్ని ప్రారంభించిన జిల్లా SP విశాల్ గున్ని
చిలకలూరిపేటలోని ప్రముఖ స్వచ్చంధ సేవ సంస్థ అయిన అసిస్ట్ ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన ప్రచార రధాన్ని ఎస్పీ విశాల్ గున్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రచార రధం ద్వారా 200 గ్రామాలలో కరోనా వ్యాక్సిన్ పైన అవగాహనా కలిపించటమే ముఖ్య ఉదేశ్యంగా తెలిపారు. అలాగే జిల్లా రూరల్ ఎస్పీ గారు మాట్లాడుతూ అసిస్ట్ సంస్థ గుంటూరు,ప్రకాశం జిల్లాలో వారు చేసిన మంచి కార్యక్రమాలను కొనియాడారు. గ్రామాలలో ని ప్రజలకు వ్యాక్సిన్ పైన ఉన్న అపోహలను తొలగించి వ్యాక్సిన్ కి అందరూ సహకరించాలి అని తెలిపారు.
చిలకలూరిపేట - మునిసిపల్ కమిషనర్ ఆధార్ సెంటర్ల పైన ఆగ్రహం - త్వరలో సచివాలయాలలో ఆధార్ సవరణ చేసుకునే అవకాశం కలిపిస్తాం
చిలకలూరిపేట - మునిసిపల్ కమిషనర్ ఆధార్ సెంటర్ల పైన ఆగ్రహం - త్వరలో సచివాలయాలలో ఆధార్ సవరణ చేసుకునే అవకాశం కలిపిస్తాం
చిలకలూరిపేట పట్టణంలోని RVSCVS హైస్కూల్ రోడ్లో ఉన్న BSNL ఆఫీస్, AP ఆన్లైన్ నందు జనాలు బారులు తీరటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు కమిష్నర్ రవీంద్ర. పట్టణంలోని ఆధార్ సవరణ కోసం జనాలు బారులు తీరటం పట్ల అసహనం వ్యక్తం చేసారు. కరోనా లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుంటే, ఇక్కడ మాత్రం కరోనా రూల్స్ బ్రేక్ చేస్తూ జనాలు గుంపులు గుంపులుగా ఉంటున్నారు. ఈ ప్రజలు గుంపులు చూసిన కమిష్నర్ రవీంద్ర గారు త్వరలో సచివాలయాలలో ఆధార్ సవరణకు అవకాశం కలిపిస్తాం అని తెలిపారు.
చిలకలూరిపేట - రోటరీ క్లబ్ అఫ్ పండరీపురమ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు
చిలకలూరిపేట - రోటరీ క్లబ్ అఫ్ పండరీపురమ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు
చిలకలూరిపేటలో ప్రముఖ స్వచ్చంధ సంస్థ అయిన రోటరీ క్లబ్ అఫ్ పండరీపురం వారి ఆధ్వర్యంలో 1.6 లక్షల విలువైన 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి తెచ్చారు. అత్యవసరంగా పట్టణంలోని ఎవరికీ అయినా ఆక్సిజన్ అంధక ఇబ్బందికి గురి అయితే తమను సంప్రదించాలి అని తెలిపారు. కాన్సన్ట్రేటర్లు కావలసినవారు క్లబ్ సభ్యులు రాఘవయ్యని సంప్రదించాలి అని తెలియజేసారు.
మునిసిపల్ కమిష్నర్ డి. రవీంద్ర గారి ముఖ్య అతిధిగా హాజరై కాన్సన్ట్రేటర్లును ప్రారంభించారు. పట్టణంలోని పేదవారికి ఉపయోగపడే విధంగా కాన్సన్ట్రేటర్లు అందించటం పట్ల పురపాలకసంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో దాతల సహకారం హర్షణీయం అని అన్నారు. ఈ సందర్భంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి
చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి
చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు తక్కువగానే ఉన్న కానీ రోజులు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మాకినేని శారదా గారు ( 62) కరొనతో మృతి చెందారు. గత కొంత కాలంగా కరొనతో బాధపడుతున్న ఆమె గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆమె మృతి తో గ్రామంలోని ప్రజలు దీక్బ్రాంతికి గురి అయ్యారు.
చిలకలూరిపేట నియోజవర్గంలో నాటుసారాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
చిలకలూరిపేట నియోజవర్గంలో నాటుసారాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామము నందు నాటుసారాయి అమ్మే వారిని అదుపులోకి తీసుకున్నారు. చిరుమామిళ్ల గ్రామంలో చాపక్రింద నీరులాగా సారాయి అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో నాదెండ్ల SI సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో ఇద్దరికి అరెస్ట్ చేసారు. వీరు గ్రామంలో ఇళ్లలో నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు సమాచారం. రమేష్, బ్రహ్మం గా గుర్తించి వారి వద్ద నుండి 12 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు.
చిలకలూరిపేట పట్టణం & నియోజకవర్గం పరిధిలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో రేపు 04/06/2021 శుక్రువారం నాడు ఎన్నెన్ని టీకాలు కేటాయించారు అంటే !
CHILAKALURI PET SPEED NEWSThursday, June 03, 2021కరోనా న్యూస్, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట పట్టణం & నియోజకవర్గం పరిధిలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో రేపు 04/06/2021 శుక్రువారం నాడు ఎన్నెన్ని టీకాలు కేటాయించారు అంటే !
చిలకలూరిపేట పట్టణంలో
గవర్నమెంట్ హాస్పిటల్ నందు - 300
సుబ్బయ్యాతోట మునిసిపల్ డిస్పెన్సరీ - 200
రజక కాలనీ ఆరోగ్యకేంద్రం నందు - 300
పురుషోత్తమపట్నం నందు - 200 టీకాలను కేటాయించారు.
నియోజకవర్గ పరిధిలో
యడ్లపాడు పి.హెచ్.సి - 500
నాదెండ్ల - 400
గణపవరం - 500 టీకాలు వేస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ గారు తెలిపారు.











