మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

చిలకలూరిపేట - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు

చిలకలూరిపేట - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీబీఎన్ ఆర్మీ, పట్టాన టీడీపీ యూత్, సీనియర్ నాయకులూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను పార్టీ ఉపాధ్యక్షులు కరీముల్లా గారు కట్ చేసారు. 4000 కోట్ల రూపాయలతో చిలకలూరిపేట నియోజకవర్గ రూపురేఖలు మార్చి వేసిన పుల్లారావు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వర్ధిలాలి అని తెలిపారు. పట్టణంలోని నిరాశ్రయులకు బిర్యానీ పంచిపెట్టారు. అలాగే బాపూజీ వృధాశ్రమం నందు బిర్యానీ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీనియర్ నాయకులు, యూత్ సభ్యులు, పార్టీ నాయకులూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
























Share:

చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు - రావు సుబ్రహ్మణ్యం

చిలకలూరిపేట - వ్యాక్సిన్ తీసుకున్నవారికి కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు అధికారులు  - రావు సుబ్రహ్మణ్యం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు శనివారం మధ్యాన్నం 3 గంటల సమయం లో రజక కాలనీ నందు ఉన్న ఆరోగ్య కేంద్రం నందు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకొని జిల్లా వైద్య అధికారులతో మాట్లాడారు. 240 వ్యాక్సిన్లు కేటాయిస్తే 50 మందికి మాత్రమే వేశారు. 190 వ్యాక్సిన్లు మిగిలాయి వాటిని కూడా అర్హులకు  ఉపయోగించాలి అని . వాలటరీలు స్లిప్స్ ఇచ్చిన తరువాత వ్యాక్సిన్ కోసం అని ఇక్కడికి వస్తే 84 రోజులు గడిచాకే సెకండ్ డోస్ వేస్తాం అని చెప్పటంతో వాళ్ళు వెనుతిగారు అని ఇలా ప్రజలను అనవసరంగా వ్యాక్సిన్ సెంటలకు తిప్పటం పట్ల  జిల్లా వైద్య అధికారుల పని తీరు పైనా ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికీ కనీసం జ్వరం టాబ్లెట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నారు అని తెలిపారు. అలాగే కొన్ని వ్యాక్సిన్ సెంటర్లలో 2000 రూపాయలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అని వాటిపైన ద్రుష్టి పెట్టాలి అని తెలియజేసారు . 



























Share:

చిలకలూరిపేట - బంగారం చోరీ కేసుని నేరుగా పరిశీలించిన డిఎస్పీ

 చిలకలూరిపేట - బంగారం చోరీ కేసుని నేరుగా పరిశీలించిన డిఎస్పీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో నిన్న జరిగిన చోరి కేసును ఛేదించటానికి నేరుగా డిఎస్పీ విజయ భాస్కర్ గారు నేరుగా చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితురాలు పుచ్చకాయల సీతారావమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీతారావమ్మ చెప్పిన దాని ప్రకారం అప్పుడప్పుడు ఆమె బీపీ, షుగర్ పరీక్షల కోసం అని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. అయితే వచ్చిన దొంగలు ఆరోగ్య పరీక్షలు ఏంటి వద్ద నిర్వహిస్తాము అని చెప్పి ఆమెను కట్టేసి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదుతో పారిపోయారు. అని తెలిపారు. డీఎస్పీ చుట్టుపక్కల స్థానికులతో మాట్లాడి అనంతరం త్వరలోనే నిందితులను పట్టుకొని అరెస్ట్ చేస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ తోపాటు పట్టణ, రూరల్ CI లు పాల్గొన్నారు.    







































Share:

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి

ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా వ్యాక్సిన్ తీసుకున్నా పురుషుడు మృతి  

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి పురుషుడు విలియం షేక్స్పియర్ (80) మంగళవారం నాడు కన్నుమూశారు. బ్రిటన్ దేశంలో డిసెంబర్ 8 న ఫైజర్ అనే బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే అయిన చనిపోవడానికి కరోనా కాదు అని తెలుస్తుంది. కరోనా కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన మరణించారు అని వైద్యులు నిర్ధారించారు. 































Share:

చిలకలూరిపేటలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందిన మహిళా

చిలకలూరిపేటలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో మృతి చెందిన మహిళా 

https://chilakaluripetspeednews.blogspot.com/

మంగళవారం ఉదయం పట్టణంలోని  రాగన్నపాలెం కి చెందిన ఒక మహిళా (50) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో గుంటూరు GGH లో జాయిన్ అయినది. సదరు మహిళా మంగళవారం సాయంత్రం నాడు మృతి చెందారు. అయితే కరోనా తగిన తర్వాత మళ్లీ ఈ కొత్త బ్లాక్ ఫంగస్ వలన కరోనా తగ్గిన వ్యక్తులలో ఆందోళన మొదలైనది. 






















































Share:

చిలకలూరిపేట - ఆరోగ్యపరీక్షలు చెయ్యటానికి వచ్చాము అని చెప్పి - బంగారం తో ఉడాయించిన దొంగలు

చిలకలూరిపేట - ఆరోగ్యపరీక్షలు చెయ్యటానికి వచ్చాము అని చెప్పి - బంగారం తో ఉడాయించిన దొంగలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం నాలుగో లైన్ నందు కొంతమంది వ్యక్తులు ఆరోగ్య పరీక్షలకు వచ్చాము అని నమ్మబలికి తీరా ఇంటిలోకి ప్రవేశించాక ఆమెను కుర్చీలో తాళ్లతో కట్టివేసి గుడ్డలు నోటిలో కుక్కి ఆమె మేడలో ఉన్న 17 సవర్ల బంగారాన్ని, 4000 రూపాయల నగదుతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పట్టాన CI బిలాలుద్దీన్ గారు సంఘటన స్థలానికి చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. CI బిలాలుద్దీన్ గారు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు వస్తే పట్టాన పోలీసుస్టేషన్ నందు సమాచారం అందించాలి అని తెలిపారు. 







































Share:

చిలకలూరిపేటలో గుట్కా విక్రయాల పైనా పోలీసుల పంజా - ఒకరు అరెస్ట్

చిలకలూరిపేటలో గుట్కా విక్రయాల పైనా పోలీసుల పంజా - ఒకరు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో గుట్కా విక్రయించే వారి పైనా పోలీసులు పంజా విసిరారు. అర్బన్ CI బిలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో SI సుబ్బారావు, నరసాదాసు మరియు పోలీస్ సిబ్బంది తో పట్టణంలోని పలు షాపులలో తనిఖీలు చేపట్టారు. అయితే చలివేంద్రం బజార్ నందు ఒక షాపునందు అనుమానంతో వెతకగా వందల సంఖ్యలో నిషేధిత గుట్కా, విమల్ ప్యాకెట్స్ బయటపడ్డాయి. అయితే సదరు వ్యక్తిని విచారించగా కొంతమంది వ్యక్తులు టూ వీలర్ లో వచ్చి తమకు వీటిని MRP ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి 5,10 రూపాయల లాభంతో వీటిని అమ్ముతున్నట్లు తెలిపారు. అయితే ఆ వ్యక్తిపైన కేసు నమోదు చేసి, పాకెట్స్ సీజ్ చేసి, అరెస్ట్ చేసారు.  5,10 రూపాయల లాభంకోసం ఇతరుల ప్రాణాలని రిస్క్లో పెడుతున్నారని, పట్టణంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. 













Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి