|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిMP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం
CHILAKALURI PET SPEED NEWSFriday, May 14, 2021గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం
చిలకలూరిపేట కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించారు. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు మౌలిక సదుపాయాలు తనిఖీ చేశారు. హాస్పిటల్ గదులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల శుభ్రతను పరిశీలించి దిశా నిర్దేశం చేసారు. అలాగే కరోనా వార్డు నందు బెడ్లు పెంపు నాకు లేఖ జిల్లా అధికారులకు రాసారు. అలాగే త్వరలో రెమిడీసివెర్ ఇంజక్షన్,ఆక్సిజన్ సీలిండర్ల పైనా ద్రుష్టి పెట్టారు.హాస్పటల్ నందు అత్యవసర గా కొంత మంది డాక్టర్లను, నర్స్ లను తీసుకోవాలి అని ప్రధాన వైద్యురాలిని కోరారు. అలాగే కొత్తగా తీసుకున్న వారికీ గవర్నమెంట్ జాబులకు రెఫరెన్సు సిఫారసు చేస్తాము అని తెలిపారు. దాతలు ఎవరైనా హాస్పిటల్ నాకు సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు.
ఎంపీ పిలిపు మేరకు హాస్పిటల్ నందు నాయుడు రమేష్ గారు మరుగుదొడ్లు నందు పైపులను మరమ్మతు చేపించారు, హాస్పిటల్ గదుల నందు కొత్త ఫ్యాను లను ఎర్పాటు చేసారు. అలాగే గురువారం నాడు అసిస్ట్ సంస్థ నుండి కరోనా రోగులకు ఆక్సిజన్ మాస్కులు, గన్ మీటర్లు, పేస్ షీల్డులు , డాక్టర్లకు,సిబ్బందికి పి పి ఏ కిట్లను అందజేశారు . అలాగే సింగపూర్ నందు ఉంటున్న బైరా స్వర్ణలత గారు 20 ఆక్సిజన్ సీలిండర్లను అందజేశారు. అలాగే కరోనా వార్డులలో ఉన్న 20 బెడ్లను 30 కి పెంచారు. మరో రెండు రోజులలో మరిన్ని సౌకర్యాలను అందజేస్తాం అని మంత్రి అనుచరులు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు వైస్సార్సీపీ ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.
చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు
CHILAKALURI PET SPEED NEWSFriday, May 14, 2021ఆంధ్రప్రదేశ్, కరోనా న్యూస్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం, చిలకలూరిపేట యూట్యూబ్ న్యూస్, తెలంగాణ, భారత్, వరల్డ్ న్యూస్
No comments
చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు
ముందుగా చిలకలూరిపేట ముస్లిం సోదరులకు చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ తరుపున రంజాన్ శుభాకాంక్షలు. అలాగే పట్టణములోని ముఖ్య నాయకులూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. MLA విడదల రజని గారు, ప్రతిపక్షనేత మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే రంజాన్ విశిష్టత తెలియజేసారు.
ఈ రంజాన్ పండుగ నుండి కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని అల్లా ని కోరుకుందాం. ప్రార్ధన సమయాలలో మాస్క్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం.
చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు
చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు
చిలకలూరిపేట - పట్టణాన్ని వరుణ దేవుడు అలా పలకరించి వెళ్లారు . కొన్నిరోజులుగా పట్టణములో ఎండలు మండిపోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా మధ్యాహ్నం 12 తరువాత ఎవరు బయటకి రాకపోవటంతో ఎండల తీవ్రత అర్ధం కావటం లేదు కానీ బయట ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈరోజు 3 గంటల ప్రాంతంలో నల్లటి మొబ్బులతో చల్లటి వాతావరం ఏర్పడింది. అయితే దానికి తోడు తుపాను తలపించేలా గాలులు వీచాయి. దీనితో పట్టణములోని ప్రజలు కొంచం సేపు వాతావరణాన్ని ఆస్వాదించారు. చల్లటి గాలులు, చిన్న చిన్న వర్షపు చినుకులతో రోడ్లు అన్ని తడిచాయి. ఇంతలోనే మొబ్బులు మాయం గాలులు ఆగిపోయాయి .
ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే
ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే
శ్యామ్ కలకడ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ అభిమానులు, పార్టీ సోషల్ మీడియా, పార్టీ ముఖ్యనేతలకు ఈ పేరు తెలియని వారు ఉండరు. వైస్సార్సీపీ పార్టీకి సోషల్ మీడియా వెన్నుముక గా చెప్పుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు.
శ్యామ్ కలకడ సొంత ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. వృత్తి రీత్యా సాఫ్టువేర్ ఇంజనీర్, బెంగళూర్ నందు ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్, ముఖ్యంగా తెలుగువారు ఎవరైనా బెంగళూర్ వచ్చారు అంటే అక్కడి వసతులకు, ఆహారానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే వ్యకి ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి అనుకోకుండా 2010 నుండి రాజకీయాలకు దగ్గిరగా ఉండి వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి యువతను పార్టీకి దగ్గిర చేస్తూ , ముఖ్యంగా గత పాలకుల వైఫల్యాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు తెలిసేలా చేసి పార్టీ ని యువతలో బలోపేతం చేసిన వ్యక్తి . అలా బెంగళూర్ వేదికగా వైస్సార్సీపీ పార్టీ తెలుగు ప్రజలకు చేరువ చెయ్యటంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ముఖ్య నేతలే ఒప్పుకుంటారు.బెంగళూర్ వైస్సార్సీపీ ఐటీ వింగ్ శ్యామ్ కలకడ
అయితే కరోనా కారణంగా శ్యామ్ నిన్న తుది శ్వాస విడిచారు. లక్షలాది మంది వైస్సార్సీపీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ సభ్యులు ఆయన మరణ వార్తను ట్రిండింగ్ చేసారు. ట్విట్టర్,ఫేసుబుక్కులలో ఎక్కడ చూసిన అతని పోస్థులే. పార్టీలో అంత చనువు ఉన్న ముఖ్య వ్యక్తి చనిపోతే సాయంత్రం వరకు కూడా సీఎం జగన్ స్పందించక పోవటం పార్టీ యువతను తీవ్రంగా కలచివేసింది. పార్టీ ఫాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని గురి అయ్యారు. పార్టీ ముఖ్య వ్వక్తి కరొనతో బాధపడుతుంటే మంచి వైద్యం అందించలేకపొయ్యారు అని. మంచి వైద్యం అందించి ఉంటే బ్రతికి ఉండేవాడు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్రేండింగ్ చేసారు అభిమానులు. ఎట్టకేలకు సాయంత్రం సమయానికి స్వయంగా సీఎం జగన్ శ్యామ్ భార్యకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. సీఎం జగన్ స్పందనకు పార్టీ యూత్ కొంచం శాంతించారు. అయిన శ్యామ్ మరణం పార్టీ సోషల్ మీడియా కి తెరనిలోటుగా భావిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు.
చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్
చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్
చిలకలూరిపేట పట్టణంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా అఖిల భారత విద్య పరిషత్ (ABVP ), బీజేపీ,భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు,యువకులు సంయక్తంగా పట్టణములోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్వచ్చంధంగా శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. పట్టణములోని దేవాలయాలు,గోశాలలు, మార్కెట్ పరిసర ప్రాంతాలు,పాఠశాలలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ శానిటైజేషన్ చేపడుతున్నారు. రోజుకు ఒక ఏరియా చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యకార్యకమాలలో ABVP - మురారి,బీజేపీ - వంశీ, ఫణి , ట్రస్ట్ - కందుల రవి, నాయుడు ఫణి , సాయి, నరసరావుపేట పార్లమెంట్ ఓబీసీ ,మోర్చా ఉపాధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి, డీజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే
ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే
గూగుల్ పే ప్రస్తుత పరిస్థితులలో డిజిటల్ పేమెంట్స్ తెలియనివారు ఉండరు. ఫోన్ పే , గూగుల్ పే బ్యాంకు ట్రాన్సక్షన్ మరింత సులభతరం చేసాయి. బ్యాంకులకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించటం వలన సమయము కలిసి రావడంతో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ మొగ్గు చూపుతున్నారు. పల్లెలు, పట్టణాలు,గ్రామాలూ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క చోట బడ్డీ కొట్టు నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి.
అయితే డిజిటల్ పేమెంట్ ఆల్ఫాబెట్ కంపెనీ కి సంబంధించిన గూగుల్ పే ఇప్పుడొక శుభవార్త తెలిపింది. త్వరలో అంతర్జాతీయ పేమెంట్స్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా నుండి పేమెంట్స్ పంపుకోవటానికి వీలుగా ఎర్పాట్లు చేస్తున్నాము అని , అయితే అమెరికాలో కూడా గూగుల్ పే వాడే వారికి మాత్రమే ఈ అవకాశం అని. త్వరలోనే అన్ని దేశాలలో ఈ ఫీచర్ని తీసుకువస్తాము అని తెలిపింది.
గూగుల్ పే తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే ఎలా రెస్పాండ్ అవుతుందో చూదాం.
చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!
చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!
చిలకలూరిపేట పట్టాన పుర ప్రజలకు కరోనా వీర విజృంభణ కారణంగా మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ కారణంగా విద్యుత్ బిల్లు చెల్లింపునకు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే రావలెను అని డి ఈ ఈ సి. హెచ్ రాంభొట్ల గారు తెలిపారు. అందువలన బిల్లు చెలింపునకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ వాడాలి అని , క్యూ లైన్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాలి. కరోనా నియమాలు పాటించాలి అని తెలిపారు

















