|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్
చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్
చిలకలూరిపేట పట్టణంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా అఖిల భారత విద్య పరిషత్ (ABVP ), బీజేపీ,భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు,యువకులు సంయక్తంగా పట్టణములోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్వచ్చంధంగా శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. పట్టణములోని దేవాలయాలు,గోశాలలు, మార్కెట్ పరిసర ప్రాంతాలు,పాఠశాలలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ శానిటైజేషన్ చేపడుతున్నారు. రోజుకు ఒక ఏరియా చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యకార్యకమాలలో ABVP - మురారి,బీజేపీ - వంశీ, ఫణి , ట్రస్ట్ - కందుల రవి, నాయుడు ఫణి , సాయి, నరసరావుపేట పార్లమెంట్ ఓబీసీ ,మోర్చా ఉపాధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి, డీజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే
ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే
గూగుల్ పే ప్రస్తుత పరిస్థితులలో డిజిటల్ పేమెంట్స్ తెలియనివారు ఉండరు. ఫోన్ పే , గూగుల్ పే బ్యాంకు ట్రాన్సక్షన్ మరింత సులభతరం చేసాయి. బ్యాంకులకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించటం వలన సమయము కలిసి రావడంతో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ మొగ్గు చూపుతున్నారు. పల్లెలు, పట్టణాలు,గ్రామాలూ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క చోట బడ్డీ కొట్టు నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి.
అయితే డిజిటల్ పేమెంట్ ఆల్ఫాబెట్ కంపెనీ కి సంబంధించిన గూగుల్ పే ఇప్పుడొక శుభవార్త తెలిపింది. త్వరలో అంతర్జాతీయ పేమెంట్స్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా నుండి పేమెంట్స్ పంపుకోవటానికి వీలుగా ఎర్పాట్లు చేస్తున్నాము అని , అయితే అమెరికాలో కూడా గూగుల్ పే వాడే వారికి మాత్రమే ఈ అవకాశం అని. త్వరలోనే అన్ని దేశాలలో ఈ ఫీచర్ని తీసుకువస్తాము అని తెలిపింది.
గూగుల్ పే తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే ఎలా రెస్పాండ్ అవుతుందో చూదాం.
చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!
చిలకలూరిపేట విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమి అనగా !!!
చిలకలూరిపేట పట్టాన పుర ప్రజలకు కరోనా వీర విజృంభణ కారణంగా మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ కారణంగా విద్యుత్ బిల్లు చెల్లింపునకు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే రావలెను అని డి ఈ ఈ సి. హెచ్ రాంభొట్ల గారు తెలిపారు. అందువలన బిల్లు చెలింపునకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ వాడాలి అని , క్యూ లైన్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాలి. కరోనా నియమాలు పాటించాలి అని తెలిపారు
తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.
తమిళనాడు లో MK స్టాలిన్ సంచలన నిర్ణయం - అమ్మ కాంటిన్లు జయలలిత ఫొటోతోనే కొనసాగుతాయి.
తమిళనాడు గడిచిన 2021 అసెంబ్లీ ఎన్నికలలో DMK (స్టాలిన్) 234 స్థానాలకు గాను 159 స్థానాలు గెలిచి విజయకేతనం ఎగురవేశారు. అయితే గెలిచిన ఆనందంలో పార్టీ కార్యకర్తలు చెన్నై లోని AIDMK పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎర్పాటు చేసిన అమ్మ కాంటీన్ల పైన దాడి చేసి జయలలిత ఫోటోలను చించివేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి MK స్టాలిన్ అలాంటి చర్యలకు పాల్పడిన సొంత పార్టీవాళ్ల పైనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీచేశారు. అలాగే ఇక పైన కూడా అమ్మ కాంటీనులు కొనసాగుతాయి అని తెలిపారు. కొనసాగటమేకాదు అందులో జయలలిత ఫొటోలు కూడా ఉంటాయి అని తెలిపారు. అలాగే కార్యకర్తలు చించివేసిన జయలలిత ఫోటోల స్థానంలో జయలలిత కొత్త ఫొటోలను ఎర్పాటు చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసారు. MK స్టాలిన్ కు తమిళనాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు
ఎంపీ చొరవతో చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా బెడ్లు పెంపు
చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇప్పటి వరకు 20 కొవిడ్ బెడ్లు మాత్రమే ఉండేవి. 20 మందికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆకస్మిక పర్యటన చేసి హాస్పిటల్ వసతుల పైన దృష్టి పెట్టాలి అని తెలియజేశారు. అయితే ఎంపీ గారి చొరవతో 20 బెడ్లను 30 కి పెంచాలి అని అధికారులకు లేఖ రాయటం జరిగింది. అయితే ఆయా లేఖ పైన స్పందిస్తూ జిల్లా అధికారులు 10 బెడ్లు అదనంగా ఎర్పాటు చేసారు. దీనితో పట్టణములోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొత్తం 30 బెడ్లు ఉన్నవి. ఇక పైన 30 మంది కరోనా రోగులకు ఉచిత వైద్యం నిర్వహిస్తారు
నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ - MP శ్రీ కృష్ణ దేవరాయలు
నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ - MP శ్రీ కృష్ణ దేవరాయలు
రెమిడీసివిర్ ఈ పేరు ఈ మధ్య కాలంగా బాగా అందరి నోళ్ళలో నానుతున్న పేరు. ఇక కరోనా వలన హాస్పిటల్ కి వెళ్లి అక్కడి నుండి నుండి కోలుకున్న వాళ్లకు అయితే ఇది ఒక అమృతం లాగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే కరోనా వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికీ కూడా ఈ ఇంజక్షన్ ఇచ్చిన తరువాత త్వరగా కోలుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందువలన దీని రేటు కూడా 2500 అమ్మవలసిన ఒక్క ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్లో 40,000 కొనుకున్న వారు కూడా ఉన్నారు.
అయితే నరసరావుపేటలో రెమిడీసివిర్ ఇంజక్షన్ తయారీకి అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ రాసారు MP శ్రీ కృష్ణ దేవరాయలు గారు. నరసరావుపేటలో గుంటూరు రోడ్డులో ఉన్న సేఫ్ ఫార్మాసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మందులు తయారీ కంపెనీకు రెమిడీసీవర్ తయారు చేయటానికి కావలిసిన సదుపాయాలు ఉన్నవి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి అత్యవసర అనుమతులు కోరుతూ లేఖ రాసారు. రెమిడీసీవర్ అనుమతులు ఇస్తే ప్రతి రోజు 60,000 ఇంజక్షన్ తాయారు చేయగలమని. దాని వలన కొంచం అయినా కొరత తగ్గించవచ్చు అని లేఖ లో పేర్కొన్నారు నరసరావుపేట MP లావు శ్రీ కృష్ణ దేవరాయలు .
చిలకలూరిపేట - మా పరిస్థితి ఏంటి !!!
చిలకలూరిపేట - మా పరిస్థితి ఏంటి !!!
చిలకలూరిపేటలో 1858 మందికి వ్యాక్సిన్ రెండవ డోసు వెయ్యాలి, ఈ రెండు రోజులు వారికీ మాత్రమే వ్యాక్సినేషన్ అన్నారు. రెండవ డోసు సమయానికి వెయ్యకపోతే వృధా అవుతుంది కాబట్టి వారికీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది అంతా బాగుంది. కానీ ఇప్పటి వరకు గవెర్నమెంట్ ప్రజా వైద్యశాలలలో 1858 మంది మొదటి డోసు వేపించుకున్నారు. వారి వివరాలు సిద్ధం చేసి రెండవ డోసు రెడీ అవుతున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటలలో మొదటి డోసు వ్యాక్సిన్ వేపించుకున్న వారి పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు. ఇప్పటికే పట్టంలో కోవిడ్ ఆసుపత్రులకు అనుమతి పొందిన వాటిలలో చాలా మంది మొదటి డోసు తీసుకున్నారు. అయితే ప్రజా వైద్యశాలలో మాత్రమే మొదటి డోసు తీసుకున్న వారికీ మాత్రమే రెండవ డోసు వేస్తున్నారు. మేము కూడా వ్యాక్సిన్ తీసుకొని 4 వారలు అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ దగిరకు వెళ్లి సెకండ్ డోసు అని అడిగేతే ప్రభుత్వం మాకు వ్యాక్సిన్ ఇవ్వటం లేదు అని సమాధానం వస్తుంది. సెకండ్ డోసు లేట్ అయితే మళ్లీ మొదటి డోసు తీసుకోవలసి వస్తుంది అని మా పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వీరి పైన కూడా ద్రుష్టి పెట్టి రెండవ డోసు కి అవకాశం కలిపించాలి అని కోరుకుంటున్నారు.













