మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

Advertisement - 2

Image3

........

Advertisement - 3

Image3

........

ప్రకటనల కోసం 90358 80349 నెంబర్ కు సంప్రదించండి.
|

⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!

చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.

💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి

బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా

బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద  కూరగాయలతో వెళ్తున్న అప్పి ఆటో బోల్తా పడింది. వివరాలలోకి వెళ్తే గోవింద పురం కి చెందిన పెద్ద వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పొలం లో పండిన కూరగాయలను తీసుకొని మార్టూరు మార్కెట్ కి వెళ్లే దారిలో ఆంజనేయస్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఒంగోలు వైపు వెళ్తున్న లారీ అప్పి ఆటోని ఢీ కొన్నది. ఆటో అదుపుతప్పి రోడ్ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. ఈ సమయంలో ఆటో లో ప్రయాణిస్తున్న వ్యక్తి మరియు డ్రైవర్ గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనం సిబ్బంది అక్కడకి వచ్చి గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. 



















Share:

చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి

చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టంలోని మునిసిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలు విషయాలు చర్చించారు. ఈ సమావేశంలో చైర్మెన్ రఫాని గారు, వైస్ చైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, కమిష్నర్ రవీంద్ర గారు,ది  ఛాంబర్ ఆఫ్ కామర్స్ పట్టణ అధ్యక్షులు కూనల సుబ్రమణ్యం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రోజు రోజుకి విస్తరిస్తున్న క్రమంలో పట్టణంలోని అన్ని వ్యాపార దుకాణాలు స్వచ్చందంగా  సోమవారం నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం  6 గంటల వరకు మాత్రమే తెరిచివుంటాము అని తెలిపారు. పట్టణ ప్రజలు ఇది గమనించి సహకరించవలసినదిగా కోరారు. అలాగే ప్రతి దుకాణంలో నో మాస్క్ నో సేల్ బోర్డు పెట్టాలి తెలిపారు . కరోనా నియమాలి తప్పకుండా పాటించాలి అని తెలిపారు. 

















 
Share:

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామము నందు శుక్రవారం నాడు రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని జమ్మలమడక ఆదిబాబు అసైన్ట్ భూముల విషయం మాట్లాడటానికి అదే గ్రామాని చెందిన ఆరుమళ్ల వెంకట శివ అనే వ్వక్తి  ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో భూముల విషయం అడగగా వారి మధ్య మాటలు దాటి వెంకటశివ ఆదిబాబుని నెట్టాడు. ఆ సమయంలో ఆదిబాబు పక్కనే ఉన్న కాలవలో పడ్డాడు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరం నెలకొన్నది. ఇరువర్గాలు రురల్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాలు ఒకే పార్టీ కావటం విశేషం. 


















 
Share:

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో కన్నుమూత

తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో కన్నుమూత

https://chilakaluripetspeednews.blogspot.com/

తమిళ సినీ పరిశ్రమకి చెందిన స్టార్ కమెడియన్ వివేక్ (59) ఈ రోజు తెల్లవారు జామున 4:35 గంటలకు మరణించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రువారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర గుండెనొప్పితో చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించటంతో మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రతికి లోనైనది. తెలుగులో డబ్బింగ్ సినిమాలతో పరిచయం అయ్యారు. అపరిచితుడు, శివాజీ ది బాస్ లాంటి సినిమాలో చాల తెలుగు డబ్బింగ్ మూవీస్ నందు నటించారు. 














Share:

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు

సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో "ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్" ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు ఆంజనేయులు గారు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం నుండి జిల్లాలోని అన్ని వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 9 గంటల నుండి  సాయంతం 6 గంటల వరకే తెరచి ఉంచాలి అని నిర్ణయించారు. ప్రతి ఒక్క షాప్ నందు నో మాస్క్ బోర్డు పెట్టాలి అని తెలిపారు. సోమవారం నుండి కఠినంగా అమలు చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.  
















 
Share:

చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు

చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలో శుక్రవారంనాడు ముసిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు సెంటర్లలో మాస్క్ లేకుండా తెరిగే వారి వద్ద నుండి అపరాధ రుసుము వసూల్ చేసారు. కరోనా ఉదృతి  పెరుగుతున్న కారణంగా ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మాస్క్ లేకుండా బయట తిరిగితే ఫైన్ వసూళ్లు చేస్తారు అని తెలిపారు. ఈ రోజు పట్టణంలో 28 మంది వద్ద అపరాధరుసుము వసూళ్లు చేసారు. 28 మంది నుండి 4700 రూపాయలు వసూళ్లు చేసినట్లు తెలిపారు కమీష్నర్ రవీంద్ర గారు. ప్రతి ఒక్కరు కరోనా రూల్స్ పాటించాలి అని కరోనా కట్టడికి సహకరించాలి అని తెలిపారు   


















Share:

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు

https://chilakaluripetspeednews.blogspot.com/
 

రంజాన్ నెల ప్రారంభమైన సంగతి అందరికి తెలిసినదే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రంజాన్ మాసం లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష పాటిస్తారు కావున వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉంటున్నారు. ఈ సందేహాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ పొట్టలోకి కాకుండా రక్తనాళాల్లో కి వెళ్తుంది కాబట్టి ఉపవాస దీక్ష భగ్నం కాదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. అందువలన మన పేట మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు ఈ విషయాన్ని చేరవేయండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ప్రార్ధనలో పాల్గొనే ముందు మాస్క్ ధరించి, శానిటైజర్ వాడండి.   













Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.
📸
మీ వార్తలను మాతో పంచుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి