|
📢 స్పాన్సర్డ్ ప్రకటన
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు "0" చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి: +91 70135 89826 (ఆదిత్య సోలార్)
మరిన్ని పక్కా లోకల్ అప్‌డేట్స్.. నిజం నికార్సుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వండి:
💬 WhatsApp లో ఫాలో అవ్వండి 📸 చిలకలూరిపేట లోని వార్తల వీడియోలు కోసం Instagram లో ఫాలో అవ్వండి⚡ తాజా వార్తలు
⚡ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ వాట్సాప్ గ్రూపులో చేరండి!
చిలకలూరిపేట తాజా వార్తలు మరియు బ్రేకింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో పొందండి.
💬 ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండిచిలకలూరిపేట తహశీల్ధార్ శ్రీమతి జి సుజాత పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు
చిలకలూరిపేట తహశీల్ధార్ శ్రీమతి జి సుజాత పైన కోర్టు ధిక్కరణ కేసు నమోదు :--
బొప్పూడి రైతులకు సంబంధించిన భూముల విషయం లో హైకోర్టు చిలకలూరిపేట తహసీల్దార్ గారు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి అని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అయినప్పటికీ వాటిని ఉల్లంగిస్తూ రైతులపైన తహసీల్దారు గారు పోలీసులకి ఫిర్యాదు చేసారు. .చిలకలూరిపేట రురల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రైతులపైనా కేసు నమోదు అయినందువలన , సి సుబ్బాయమ్మ అనే మహిళా రైతు హైకోర్టు నందు తహశీల్ధార్ సుజాత గారి పైన కోర్టు ధిక్కరణ కేసు వేశారు.
ఈ సందర్భంగా నవతరం పార్టీ జాతీయ అధినేత రావు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతు బొప్పూడి, రాజాపేట, మురికిపూడి, రైతులకు మద్దతుగా ఉంటాను అని, ధిక్కరణ కేసు కాపీ ని ముఖ్యమంత్రికి, గవర్నర్, మైనింగ్ శాఖ మంత్రులకి రైతులతో కలిసి అందచేస్తాం అని పేదలకి అండగా వుంటాను అని తెలిపారు.
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ ఛైర్మెన్ కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--
చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ ఛైర్మెన్ కు అభినందనలు తెలిపిన నాయి బ్రాహ్మణ నాయకులు :--
చిలకలూరిపేటలో నాయి బ్రాహ్మణ నాయకులూ నూతనముగా మున్సిపల్ ఛైర్మెన్ , వైస్ చైర్మన్ గా ఎన్నిక అయిన రఫాని గారిని , కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భముగా నాయి బ్రాహ్మణ నాయకులు రఫాని గారిని , కొలిశెట్టి శ్రీనివాసరావు గారిని సత్కరించారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాలో మెగా జాబ్ మేళా
గుంటూరు జిల్లాలో మెగా జాబ్ మేళా
ఈ నెల 23వ తేదీన ఉదయం 9:30 గంటలకు మొదలు మధ్యాన్నం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఇతర వివరాలకు 1800-425-2422 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందాలి అని తెలిపారు. వయసు 18 నుండి 25 సంవత్సరాలు కలిగి ఉండాలి అని అన్నారు.
చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు పలువురి అరెస్ట్
చిలకలూరిపేట లో పేకాట స్థావరాల పైనా దాడులు :--
చిలకలూరిపేట రురల్ ఎస్ ఐ భాస్కర్ గారి ఆధ్వరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ దాడులలో భాగంగా కావూరు గ్రామము నందు 11 మంది పేకాటరాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 17,900 రూపాయల నగదుని సీజ్ చేయటం జరిగింది. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం అని SI భాస్కర్ గారు తెలిపారు.
T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు
T20 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ - కురాళ్ళు కుమ్మేసారు
36 రన్స్ తో సిరీస్ ని కైవసం చేసుకున్న భారత్ . 5వ T20 లో మన భారత జట్టు చెలరేగిపోయారు . తొలుత బాటింగ్ కి దిగిన భారత్ 20 ఓవర్లకి 224 పరుగులకి 2 వికెట్స్ కోల్పోయినది . రన్స్ మిషన్ (80*) , రోహిత్ 64, పాండ్య 39*, సూర్య 32 తో చెలరేగిపోయారు . లక్షచేధనలో భాగంగా ఇంగ్లీష్ జట్టు లో బట్లర్ 52, మలన్ 68 తో రెచ్చిపోయారు . కానీ భువి , శార్దూల్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు . చివరకు 20 ఓవర్లకు 188 రన్స్ 8 వికెట్స్ కొలిపోయి భారత్ విజయానికి చేరువ అయినది
చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు
చిలకలూరిపేట పట్టణంలోని లాడ్జి లలో SI రాంబాబు గారి ఆధ్వర్యంలో రైడ్లు జరిపారు
చిలకలూరిపేట పట్టణం లో ఉన్న ముస్లిమ్ మైనారిటీలు అందరం MLA రజని గారి వెన్నంటి ఉంటాం --- మున్సిపల్ ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట పట్టణం లో ఉన్న ముస్లిమ్ మైనారిటీలు అందరం MLA రజని గారి వెన్నంటి ఉంటాం --- మున్సిపల్ ఛైర్మెన్ రఫాని
చిలకలూరిపేట లోనే వైస్సార్సీపీ కార్యాలయము నందు ఎర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో మున్సిపల్ ఛైర్మెన్ రఫాని మాట్లాడుతూ చిలకలూరిపేట అభివృద్ధికి కృషి చేస్తున్న రజని గారికి పట్టణం లోనే మైనారిటీ లు అందరూ తోడు ఉంటాము . గడిచిన 7 దఫాలుగా పట్టణంలోని మైనారిటీలని కేవలం ఓట్ బ్యాంకు లాగా మాత్రమే చూసారు . కానీ MLA రజని గారు జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం లో పట్టణానికి ఒక మైనారిటీ వ్యక్తిని ఛైర్పర్సన్గ చెయ్యటం ఇదే మొదటిసారి . ఈ సందర్భంగా పట్టణంలోనే ప్రతి ముస్లిమ్ ఓటర్ వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఋణపడి ఉండాలి అని చెప్పారు . ఈ సమావేశం లో పట్టణ వైస్సార్సీపీ నాయకులు . పెద్దలు పాలుగోన్నారు












